గంగవరం (రెడ్ బీ న్యూస్) 10 నవంబర్ 2021: ఏజెన్సీలో తాగునీటి సమస్యను పరిష్కరించడమే తమ లక్ష్యమని అవేర్ ఫౌండేషన్ ఛైర్మన్ డాక్టర్ మాధవన్ అన్నారు. మారేడుమిల్లి మండలం ఏటుకూరు కంచుగొంది, దేవుడులంక, బలిసికొండ, అర్జునలోవ గ్రామాల్లో బుధవారం పర్యటించారు. ఈ సందర్భంగా గిరిజనులు తమ సమస్యలను ఆయన దృష్టికి తీసుకువచ్చారు. ముఖ్యంగా తాగునీటి సమస్య అధికంగా ఉందని ఆయన దృష్టికి తీసుకొని వచ్చారు. ప్రతి గ్రామంలోను మంచినీటి బోరులు ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. గిరిజన సమస్యలను పరిష్కరించడంలో తనవంతు సహాయం చేస్తామని అన్నారు. గిరిజనులకు ఆర్థికంగా ఉపాధి అవకాశాలు కల్పించేందుకు ప్రత్యేక చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో డైరెక్టర్ లక్ష్మి, వెంకటరెడ్డి, జిల్లా మేనేజర్ ఉదయ శ్రీనివాస్, సిబ్బంది లక్ష్మీప్రసన్న, శాంతిప్రియ, సర్పంచ్ మల్లేశ్వరి, గిరిజన సంఘ నాయకురాలు వాణిశ్రీ తదితరులు పాల్గొన్నారు.
Related News
-
SPECIAL STORY : సామాన్యుడి చేతికి టెక్నాలజీ అస్త్రం.. రోజువారీ జీవితంలో ‘ఏఐ’ విప్లవం!
-
TTD: తిరుమల శ్రీవారి నిత్య నైవేద్య వైభవం: ప్రసాద ప్రియుడైన ఏడుకొండలవాడు
-
VINTAGE VIBES : పాత రోజులు మళ్ళీ వచ్చేశాయ్!
-
Fulfilling Dreams: రుణం తీర్చుకున్న గురుభక్తి: పేద విద్యార్థినికి అభయమిచ్చిన ఆర్థోపెడిక్ వైద్యుడు
-
Fire Mishap on NH 44: అప్రమత్తతతో తప్పిన పెను ప్రమాదం.. 44వ జాతీయ రహదారిపై బస్సు దగ్ధం
-
TECH NEWS : వాట్సాప్లో 'బిల్ పేమెంట్స్'.. సౌలభ్యమా? ముప్పుతో కూడిన ప్రయోగమా?







