సామర్లకోట, 27 సెప్టెంబరు 2020( రెడ్ బి న్యూస్):
సమాజానికి మంచి చేకూరే విధంగా కరోనా సమయంలో కూడా ప్రాణాలను పణంగా పెట్టి సేవలందిస్తున్న మీడియా ప్రతినిధులను అభినందించాలని భారత్ మాతా సేవా పరిషత్ వ్యవస్థాపక అధ్యక్షుడు, మున్సిపల్ కౌన్సిలర్ చాంబర్ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు గొరక పూడి చిన్నయ్య దొర అన్నారు. పట్టణంలో స్థానిక బళ్ల మార్కెట్ సెంటర్ వద్ద మున్సిపల్ షాపింగ్ కాంప్లెక్స్ లో ఏర్పాటు చేసిన ప్రెస్ క్లబ్ కార్యాలయాన్ని డాక్టర్ చిన్నయ్య దొర ఆదివారం ప్రారంభించారు. ముందుగా ఇటీవల కరోనాతో రాష్ట్ర వ్యాప్తంగా మృతి చెందిన పాత్రికేయులు మీడియా మిత్రులకు విశ్వవిఖ్యాత గాయకులు ఎస్పీ బాలసుబ్రమణ్యం ఆత్మకు శాంతి చేకూరాలని మౌనం పాటించి వారికి ఘన నివాళులు అర్పించారు.అనంతరం డాక్టర్ చిన్నయ్య దొర మాట్లాడుతూ పాత్రికేయుల సమావేశాలు నిర్వహించేందుకు వీలుగా క్లబ్ కు ఫర్నీచర్ ను అందచేశారు.
స్థానిక లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ప్రతినిధులు కర్రి ఆదినారాయణ రెడ్డి పాత్రికేయులకు ఫేస్ షీల్డులు,మాస్కులను డాక్టర్ చిన్నయ్యదొర చేతుల మీదుగా అందజేశారు. క్లబ్ కార్యాలయానికి భవనాన్ని కేటాయించిన మున్సిపల్ కమిషనర్ ఏసుబాబుకు కృతజ్ఞతలు తెలియచేశారు.
ఈ కార్యక్రమంలో ప్రెస్ క్లబ్ అధ్యక్షులు సీనియర్ జర్నలిస్టు అడపా వెంకట్రావు, కార్యదర్శి పోలిమాటి విజయకుమార్, కోశాధికారి అడపా శ్రీనివాసరావు, సహాయ కార్యదర్శి బిక్కిన వెంకట్, ఉపాధ్యక్షుడు కె.భాస్కర్ చౌదరి, గౌరవ అధ్యక్షులు అలమండ రంగనాథస్వామి, ప్రెస్ క్లబ్ సభ్యులు పాల్గొన్నారు.
Related News
-
SPECIAL STORY : సామాన్యుడి చేతికి టెక్నాలజీ అస్త్రం.. రోజువారీ జీవితంలో ‘ఏఐ’ విప్లవం!
-
TTD: తిరుమల శ్రీవారి నిత్య నైవేద్య వైభవం: ప్రసాద ప్రియుడైన ఏడుకొండలవాడు
-
VINTAGE VIBES : పాత రోజులు మళ్ళీ వచ్చేశాయ్!
-
Fulfilling Dreams: రుణం తీర్చుకున్న గురుభక్తి: పేద విద్యార్థినికి అభయమిచ్చిన ఆర్థోపెడిక్ వైద్యుడు
-
Fire Mishap on NH 44: అప్రమత్తతతో తప్పిన పెను ప్రమాదం.. 44వ జాతీయ రహదారిపై బస్సు దగ్ధం
-
TECH NEWS : వాట్సాప్లో 'బిల్ పేమెంట్స్'.. సౌలభ్యమా? ముప్పుతో కూడిన ప్రయోగమా?







