గంగవరం (రెడ్ బీ న్యూస్) 22 డిసెంబర్ 2021: ప్రముఖ గణిత శాస్త్రవేత్త శ్రీనివాస రామానుజన్ జయంతి వేడుకలు, జాతీయ గణిత దినోత్సవ వేడుకలు బుధవారం ఘనంగా జరిగాయి. మండలంలోని వేములోవ ఆశ్రమ బాలికల ఉన్నత పాఠశాలలో ప్రధానోపాధ్యాయుడు ఆదివిష్ణు, గణిత ఉపాధ్యాయుడు చిన్నిబాబు ఆధ్వర్యంలో వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మానవ జీవితంలో గణితం ఆవశ్యకతను విద్యార్థులకు వివరించారు. గణితం ప్రతి విద్యార్థి తప్పనిసరిగా ప్రత్యేక శ్రద్ధ చూపాలన్నారు. తొలుత శ్రీనివాస్ రామానుజన్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ వార్డెన్ సీతారత్నం, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
Related News
-
SPECIAL STORY : సామాన్యుడి చేతికి టెక్నాలజీ అస్త్రం.. రోజువారీ జీవితంలో ‘ఏఐ’ విప్లవం!
-
TTD: తిరుమల శ్రీవారి నిత్య నైవేద్య వైభవం: ప్రసాద ప్రియుడైన ఏడుకొండలవాడు
-
VINTAGE VIBES : పాత రోజులు మళ్ళీ వచ్చేశాయ్!
-
Fulfilling Dreams: రుణం తీర్చుకున్న గురుభక్తి: పేద విద్యార్థినికి అభయమిచ్చిన ఆర్థోపెడిక్ వైద్యుడు
-
Fire Mishap on NH 44: అప్రమత్తతతో తప్పిన పెను ప్రమాదం.. 44వ జాతీయ రహదారిపై బస్సు దగ్ధం
-
TECH NEWS : వాట్సాప్లో 'బిల్ పేమెంట్స్'.. సౌలభ్యమా? ముప్పుతో కూడిన ప్రయోగమా?







