మృతుల కుటుంబాలకు పరామర్శ

గంగవరం (రెడ్ బీ న్యూస్) 25 నవంబర్ 2021: ఇటీవల రంపచోడవరం మండలం పోలవరం సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన జియ్యంపాలెం టీడీపీ గ్రామకమిటీ ప్రధాన కార్యదర్శి సోర్లం నాగ దుర్గా ప్రసాద్ దొర, చొడి రాజబాబు దొర కుటుంబాలకు టీడీపీ ఎప్పుడు అండగా ఉంటుందని మాజీ ఎమ్మెల్యే రంపచోడవరం నియోజకవర్గం ఇంచార్జ్ వంతల రాజేశ్వరి అన్నారు. జియ్యంపాలెం లో గురువారం మృతుల కుటుంబాలకు తమ సంతాపాన్ని ఆమె తెలియచేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ మండల కమిటీ అధ్యక్షుడు పాము అర్జున, మాజీ ఎంపీపీ డాక్టర్ తీగల ప్రభ టీడీపీ రాష్ట్ర రైతు అధికార ప్రతినిధి కనిగిరి రాంబాబు, టీడీపీ నాయకులు శేషమ్మ, వీరబాబు, కృష్ణ, గోపాలకృష్ణ తదితరులు ఉన్నారు.
ads
×
 • Home
 • About Us
 • Politics
 • Crime
 • Devotional
 • Education
 • Entertainment
 • General
 • Business
 • Information
 • Gallery
 • Contact Us