ఒంగోలు (రెడ్ బీ న్యూస్) 19 డిసెంబర్ 2021: ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వం మద్యం ధరలు తగ్గించడంతో మందుబాబులు ఆనందం వ్యక్తం చేస్తు్న్నారు. ఆకాశన్నంటే ధరల కారణంగా మద్యం ప్రియులు అనేక ఇబ్బందులు పడ్డారు. మద్యం ధరలు అందుబాటులోకి తేవడంతో పాటు, అమ్మకాలు పెంచుకోవడంపై దృష్టి పెట్టిన ప్రభుత్వం.. ధరలు తగ్గిస్తూ తీసుకున్న చర్యలతో మందుబాబుల ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. ఆదివారం ప్రకాశం జిల్లా సింగరాయకొండలో మద్యం ప్రియులు ఆనందోత్సాహాలతో ప్రభుత్వ మద్యం దుకాణాల వద్ద పూజలు నిర్వహించారు. మద్యం దుకాణానికి హారతులు ఇచ్చి.. అహో.. ఓహో అంటూ పాటలు పాడారు. ఇది చూసి స్థానికులు నవ్వుకున్నప్పటికీ .. మద్యం ప్రియులు మాత్రం ప్రభుత్వ నిర్ణయాన్ని స్వాగతిస్తూ పలుకుతూ ధన్యవాదాలు తెలిపారు.
Related News
-
రూ.15 కోట్ల‘స్క్రబ్బర్’ స్కామ్: అంట్లు తోమే పీచు వెనుక 'రూ.1.24 లక్షల' ఆశ చూపిన ఘరానా మోసం
-
మద్యం మత్తులో రాక్షసానందం: కారుతో తొక్కిన కిరాతకులు… మృత్యువుతో పోరాడుతున్న వైద్య విద్యార్థిని
-
VIRAL NEWS: ఎరక్కపోయి చిక్కుల్లో పడ్డ చోరులు.!
-
Trust in Public Education: సర్కారీ చదువుకు జడ్జి 'పెద్ద పీట'!
-
TTD: తిరుమల క్షేత్రంలో తాపేశ్వరం భక్తబృందం పరవశం
-
Anaparthi : ఏసీ కంప్రెషర్‌లో షార్ట్ సర్క్యూట్







