ఢిల్లీ (రెడ్ బీ న్యూస్) 2 డిసెంబర్ 2021: పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో పర్యావరణ అనుమతులు ఉల్లంఘించారంటూ జాతీయ హరిత ట్రైబ్యునల్ (ఎన్జీటీ) ఏపీ ప్రభుత్వానికి భారీ జరిమానా విధించింది. పర్యావరణ అనుమతులు ఉల్లంఘించారంటూ రాష్ట్ర ప్రభుత్వానికి రూ.120కోట్ల జరిమానా విధించింది. పర్యావరణ అనుమతులు లేకుండా కట్టిన మరో 3 ప్రాజెక్టులకు కూడా జరిమానా విధించింది. పురుషోత్తపట్నం ప్రాజెక్టుకు సంబంధించి రూ.24.56 కోట్లు, పట్టిసీమ ప్రాజెక్టుకు సంబంధించి రూ.24.90 కోట్లు, చింతలపూడి ప్రాజెక్టుకు సంబంధించి రూ.73.6 కోట్లు జరిమానా విధించింది. జరిమానాను 3 నెలల్లో చెల్లించాలని రాష్ట్రానికి ఎన్జీటీ ఆదేశించింది. ఏపీ కాలుష్య నియంత్రణ మండలికి జరిమానా చెల్లించాలని ఆదేశాల్లో పేర్కొంది. జరిమానా నిధుల వినియోగంపై ఏపీ పీసీబీ, సీపీసీబీ సభ్యులతో కమిటీ నియమించాలని ఆదేశించింది. పర్యావరణ అనుమతల ఉల్లంఘనలపై గతంలో ఎన్జీటీకి ఫిర్యాదులు అందాయి. పెంటపాటి పుల్లారావు, వట్టి వసంతకుమార్ ఎన్జీటీకి ఫిర్యాదులు చేసిన విషయం తెలిసిందే.
Related News
-
SPECIAL STORY : సామాన్యుడి చేతికి టెక్నాలజీ అస్త్రం.. రోజువారీ జీవితంలో ‘ఏఐ’ విప్లవం!
-
TTD: తిరుమల శ్రీవారి నిత్య నైవేద్య వైభవం: ప్రసాద ప్రియుడైన ఏడుకొండలవాడు
-
VINTAGE VIBES : పాత రోజులు మళ్ళీ వచ్చేశాయ్!
-
Fulfilling Dreams: రుణం తీర్చుకున్న గురుభక్తి: పేద విద్యార్థినికి అభయమిచ్చిన ఆర్థోపెడిక్ వైద్యుడు
-
Fire Mishap on NH 44: అప్రమత్తతతో తప్పిన పెను ప్రమాదం.. 44వ జాతీయ రహదారిపై బస్సు దగ్ధం
-
TECH NEWS : వాట్సాప్లో 'బిల్ పేమెంట్స్'.. సౌలభ్యమా? ముప్పుతో కూడిన ప్రయోగమా?







