గంగవరం (రెడ్ బీ న్యూస్) 10 నవంబర్ 2021: రంపచోడవరం ఐటీడీఏ ప్రాజెక్ట్ అధికారి ఆదేశాల మేరకు బుధవారం మండల స్థాయి అధికారులు గిరిజన సంక్షేమ శాఖ ఆశ్రమ పాఠశాలలను తనిఖీ చేశారు. తాహశీల్దార్ శ్రీమన్నారాయణ గంగవరం ఆశ్రమ బాలుర ఉన్నత పాఠశాలను తనిఖీ చేశారు. పాఠశాలలో రికార్డులను, వంటశాల, మరుగుదొడ్ల పరిశుభ్రతను తనిఖీ చేశారు. విద్యార్థుల కోసం తయారు చేసిన భోజనాన్ని రుచి చూసి సంతృప్తి వ్యక్తం చేశారు. అలాగే వేములోవ ఆశ్రమ ఉన్నత పాఠశాలను మండల విద్యాశాఖ అధికారి మల్లేశ్వరరావు తనిఖీ చేశారు. పాఠశాలలో రికార్డులను తనిఖీ చేసి సిబ్బందికి పలు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు ఆర్.వి.వి సత్యనారాయణ, వసతి గృహా సంక్షేమ అధికారులు ఎం. శ్రీనివాసరావు, సీతారత్నం తదితరులు ఉన్నారు.
Related News
-
SPECIAL STORY : సామాన్యుడి చేతికి టెక్నాలజీ అస్త్రం.. రోజువారీ జీవితంలో ‘ఏఐ’ విప్లవం!
-
TTD: తిరుమల శ్రీవారి నిత్య నైవేద్య వైభవం: ప్రసాద ప్రియుడైన ఏడుకొండలవాడు
-
VINTAGE VIBES : పాత రోజులు మళ్ళీ వచ్చేశాయ్!
-
Fulfilling Dreams: రుణం తీర్చుకున్న గురుభక్తి: పేద విద్యార్థినికి అభయమిచ్చిన ఆర్థోపెడిక్ వైద్యుడు
-
Fire Mishap on NH 44: అప్రమత్తతతో తప్పిన పెను ప్రమాదం.. 44వ జాతీయ రహదారిపై బస్సు దగ్ధం
-
TECH NEWS : వాట్సాప్లో 'బిల్ పేమెంట్స్'.. సౌలభ్యమా? ముప్పుతో కూడిన ప్రయోగమా?







