గంగవరం (రెడ్ బీ న్యూస్) 3 డిసెంబర్ 2021: స్థానిక గిరిజన సంక్షేమ ఆశ్రమ బాలికోన్నత పాఠశాలను శుక్రవారం సబ్ డివిజనల్ మెజిస్ట్రేట్ ఇన్చార్జ్, గిరిజన సంక్షేమ శాఖ డిప్యూటీ డైరెక్టర్ ఎం. ముక్కంటి తనిఖీ చేశారు. పాఠశాలలోని పలు విభాగాలను పరిశీలించి సిబ్బందికి పలు సూచనలు చేశారు. విద్యార్థుల ఆరోగ్యం పట్ల సిబ్బంది ప్రత్యేక శ్రద్ధ చూపాలన్నారు. విద్యార్థుల ఆరోగ్యం చదువు, అందుతున్న సదుపాయాలపై ఆరా తీశారు. విద్యార్థుల కోసం సిద్ధం చేసిన వంటకాలను రుచి చూశారు. అలాగే మరుగుదొడ్ల శుభ్రత పరిసరాల పరిశుభ్రత పై సిబ్బందికి పలు సూచనలు చేశారు. ఆయన వెంట తాహశీల్దార్ శ్రీమన్నారాయణ, పీహెచ్సీ వైద్యాధికారి డాక్టర్ అనూష, సహాయ గిరిజన సంక్షేమ అధికారి హాసిని, ఆర్ఐ జిలాని తదితరులు ఉన్నారు.
Related News
-
SPECIAL STORY : సామాన్యుడి చేతికి టెక్నాలజీ అస్త్రం.. రోజువారీ జీవితంలో ‘ఏఐ’ విప్లవం!
-
TTD: తిరుమల శ్రీవారి నిత్య నైవేద్య వైభవం: ప్రసాద ప్రియుడైన ఏడుకొండలవాడు
-
VINTAGE VIBES : పాత రోజులు మళ్ళీ వచ్చేశాయ్!
-
Fulfilling Dreams: రుణం తీర్చుకున్న గురుభక్తి: పేద విద్యార్థినికి అభయమిచ్చిన ఆర్థోపెడిక్ వైద్యుడు
-
Fire Mishap on NH 44: అప్రమత్తతతో తప్పిన పెను ప్రమాదం.. 44వ జాతీయ రహదారిపై బస్సు దగ్ధం
-
TECH NEWS : వాట్సాప్లో 'బిల్ పేమెంట్స్'.. సౌలభ్యమా? ముప్పుతో కూడిన ప్రయోగమా?







