గంగవరం (రెడ్ బీ న్యూస్) 4 జనవరి 2022: పార్టీ అభివృద్ధి కోసం కష్టపడ్డ నాయకులకు కార్యకర్తలకు పదవులు దక్కుతాయని ఎంపీపీ కృష్ణారెడ్డి జడ్పీటీసీ సభ్యురాలు బేబీ రత్నం, వైసీపీ మండల ఇన్చార్జి రఘునాథ్ అన్నారు. మంగళవారం గంగవరం ఎంపీటీసీ సభ్యురాలు గంగాదేవి రెండవ వైస్ ఎంపీపీగా ఎంపిక కావడంతో ఆమెకు వైసీపీ నాయకులు ఘనంగా సన్మానించి అభినందనలు తెలిపారు. పార్టీ ఆవిర్భావం నుంచి పార్టీ అభివృద్ధికి ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేసిన నాయకులకు కార్యకర్తలకు ఎప్పుడు గుర్తింపు ఉంటుందని ఎమ్మెల్సీ అనంత ఉదయభాస్కర్, ఎమ్మెల్యే ధనలక్ష్మి సహకారంతో మండలం అభివృద్ధికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో వైస్ ఎంపీపీ రామ తులసి, కో-ఆప్షన్ సభ్యులు కళ్లెం ప్రభాకర్, వైస్సార్సీపీ రైతు విభాగం కార్యదర్శి వైయస్ ప్రసాద్, ఎంపీటీసీలు మద్దిటి వెంకటలక్ష్మి, కోటికలపూడి రామతులసి, పద్మావతి, మండల నాయకులు బూరకట్ల నాగేశ్వరరావు పాల్గొన్నారు.
Related News
-
SPECIAL STORY : సామాన్యుడి చేతికి టెక్నాలజీ అస్త్రం.. రోజువారీ జీవితంలో ‘ఏఐ’ విప్లవం!
-
TTD: తిరుమల శ్రీవారి నిత్య నైవేద్య వైభవం: ప్రసాద ప్రియుడైన ఏడుకొండలవాడు
-
VINTAGE VIBES : పాత రోజులు మళ్ళీ వచ్చేశాయ్!
-
Fulfilling Dreams: రుణం తీర్చుకున్న గురుభక్తి: పేద విద్యార్థినికి అభయమిచ్చిన ఆర్థోపెడిక్ వైద్యుడు
-
Fire Mishap on NH 44: అప్రమత్తతతో తప్పిన పెను ప్రమాదం.. 44వ జాతీయ రహదారిపై బస్సు దగ్ధం
-
TECH NEWS : వాట్సాప్లో 'బిల్ పేమెంట్స్'.. సౌలభ్యమా? ముప్పుతో కూడిన ప్రయోగమా?







