పెద్దాపురం,31 అక్టోబరు 2020 (రెడ్ బీ న్యూస్):ఏఐటీయూసీ శత వార్షికోత్సవాలను స్థానిక వినాయకుడి గుడి సమీపంలో ఉన్న జుట్టు వర్కర్స్ యూనియన్ కార్యాలయం వద్ద శనివారం ఘనంగా నిర్వహించారు. జట్టు వర్కర్స్ యూనియన్ అధ్యక్షుడు యాకా రామకృష్ణ ఆధ్వర్యంలో యూనియన్ సీనియర్ నాయకుడు ముమ్మన సత్యనారాయణ ఏఐటీయూసీ పతాకాన్ని ఆవిష్కరించి మాట్లాడారు.1920 అక్టోబర్ 31న ఆవిర్భవించిన ఏఐటియుసి కార్మిక, కష్టజీవుల, అణగారిన వర్గాల సంక్షేమం, హక్కుల సాధన కోసం గత శతాబ్ద కాలంగా అవిశ్రాంత పోరాటం సాగిస్తోందన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కార్మిక, కర్షక వ్యతిరేక విధానాలను విడనాడి, కార్మికుల హక్కులను పరిరక్షించాలన్నారు. ఈ కార్యక్రమంలో యూనియన్ నాయకులు బోనం సోమేశ్వరరావు, బొట్టా త్రిమూర్తులు, బొడ్డు శ్రీను తదితరులు పాల్గొన్నారు.
Related News
-
SPECIAL STORY : సామాన్యుడి చేతికి టెక్నాలజీ అస్త్రం.. రోజువారీ జీవితంలో ‘ఏఐ’ విప్లవం!
-
TTD: తిరుమల శ్రీవారి నిత్య నైవేద్య వైభవం: ప్రసాద ప్రియుడైన ఏడుకొండలవాడు
-
VINTAGE VIBES : పాత రోజులు మళ్ళీ వచ్చేశాయ్!
-
Fulfilling Dreams: రుణం తీర్చుకున్న గురుభక్తి: పేద విద్యార్థినికి అభయమిచ్చిన ఆర్థోపెడిక్ వైద్యుడు
-
Fire Mishap on NH 44: అప్రమత్తతతో తప్పిన పెను ప్రమాదం.. 44వ జాతీయ రహదారిపై బస్సు దగ్ధం
-
TECH NEWS : వాట్సాప్లో 'బిల్ పేమెంట్స్'.. సౌలభ్యమా? ముప్పుతో కూడిన ప్రయోగమా?







