గంగవరం, 28 అక్టోబర్ 2021:
విశ్వాసం, విశ్వసనీయత గల బీమా రంగ సంస్థ ఎల్ఐసి అని, ఎల్ఐసిలో పాలసీదారుడుగా చేరడం ద్వారా కుటుంబానికి ఆర్థిక భరోసా లభిస్తుందని గంగవరం తహశీల్దార్ శ్రీమన్నారాయణ అన్నారు. విజిలెన్స్ అవగాహన వారోత్సవాల్లో భాగంగా గురువారం స్థానిక ఎల్ఐసి పాలసీదారుల సేవ కేంద్రం ఆవరణలో గోకవరం ఎల్ఐసి బ్రాంచ్ మేనేజర్ సూర్య నారాయణ ఆధ్వర్యంలో విజిలెన్స్ అవగాహన గ్రామసభ నిర్వహించారు. ఈ గ్రామ సభలో తహశీల్దార్, ఎంపీడీవో జాన్ మిల్టన్ ఎస్ఐ కె. షరీఫ్ ముఖ్య అతిథులుగా పాల్గొని మాట్లాడారు. ప్రతి కుటుంబానికి జీవిత బీమా సంస్థ పాలసీ ఎంతో ముఖ్యమని అన్నారు. ఎల్ఐసితో కుటుంబానికి ఆర్థిక భరోసా కలుగుతుందని, ప్రతి ఒక్కరూ జీవిత బీమాలో సభ్యులుగా చేరలన్నారు.
భారతీయ జీవితబీమా సంస్థలో పాలసీదారులకు అందించే సేవలు, కార్యకలాపాలు అత్యంత పారదర్శకంగా, నీతివంతంగానూ జరుగుతాయని బీఎం సూర్యనారాయణ అన్నారు. పాలసీదారుల క్లయిమ్స్ పరిష్కారం చాలా వేగవంతంగా జరుగుతుందని, ప్రత్యేకించి గోకవరం బ్రాంచ్ క్లయిమ్స్ పరిష్కారంలో ఇండియాలోనే ప్రధమ స్థానంలో ఉండడం గర్వకారణం అన్నారు. ఈ గ్రామసభలో గ్రామ సర్పంచ్ కలుముల అక్కమ్మ, ఉపసర్పంచ్ పరదా వెంకటేశ్వరరావు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు దిండి మహేష్, బొడ్డేటి సుబ్రహ్మణ్యం, సమరసత ఫౌండేషన్ మండల కన్వీనర్ కే.చిన్నారావు దొర, ఎల్ఐసీ ఏబీఎం శ్రీనివాస్, ఏజంట్లు జయకృష్ణ పట్నాయక్, ఉపాధిహామీ ఎపివో సురేష్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.
Related News
-
SPECIAL STORY : సామాన్యుడి చేతికి టెక్నాలజీ అస్త్రం.. రోజువారీ జీవితంలో ‘ఏఐ’ విప్లవం!
-
TTD: తిరుమల శ్రీవారి నిత్య నైవేద్య వైభవం: ప్రసాద ప్రియుడైన ఏడుకొండలవాడు
-
VINTAGE VIBES : పాత రోజులు మళ్ళీ వచ్చేశాయ్!
-
Fulfilling Dreams: రుణం తీర్చుకున్న గురుభక్తి: పేద విద్యార్థినికి అభయమిచ్చిన ఆర్థోపెడిక్ వైద్యుడు
-
Fire Mishap on NH 44: అప్రమత్తతతో తప్పిన పెను ప్రమాదం.. 44వ జాతీయ రహదారిపై బస్సు దగ్ధం
-
TECH NEWS : వాట్సాప్లో 'బిల్ పేమెంట్స్'.. సౌలభ్యమా? ముప్పుతో కూడిన ప్రయోగమా?







