ఖాజీపేట (రెడ్ బీ న్యూస్) 7 డిసెంబర్ 2021: కడప జిల్లా ఖాజీపేట ఆదర్శ పాఠశాల బాలికల వసతి గృహానికి సరకుల నిలిపివేతపై ఉదయం టీవీలో ప్రసారమైన వార్తకు స్పందన వచ్చింది. ఆదర్శ పాఠశాల వసతి గృహంలో భోజనాలు లేక 80 మంది విద్యార్థినులు ఇబ్బందులు పడుతున్న విషయంపై ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు స్పందించారు. మైదుకూరు ఎమ్మెల్యే రఘురామిరెడ్డి, సర్వ శిక్ష అభియాన్ ఏపీడీ దేవరాజ్ వసతి గృహాన్ని తనిఖీ చేశారు. వసతి గృహానికి సరకుల నిలిపివేతపై ఉన్నతాధికారులకు లేఖ రాసిన పాఠశాల ప్రిన్సిపల్ సురేష్‌తో ఏపీడీ దేవరాజ్ మాట్లాడి వివరాలు అడిగి తెలుసుకున్నారు. స్పందించిన ఏపీడీ.. వెంటనే ఇవాళ రాత్రి నుంచే పిల్లలకు భోజనాలు పెట్టాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. వసతి గృహంలో అందుబాటులో ఉన్న 30 మంది విద్యార్థినులకు భోజన వసతి కల్పించారు. రేపు మొత్తం 80 మంది విద్యార్థులకు భోజన వసతి కల్పించాలని సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.
Related News
-
SPECIAL STORY : సామాన్యుడి చేతికి టెక్నాలజీ అస్త్రం.. రోజువారీ జీవితంలో ‘ఏఐ’ విప్లవం!
-
TTD: తిరుమల శ్రీవారి నిత్య నైవేద్య వైభవం: ప్రసాద ప్రియుడైన ఏడుకొండలవాడు
-
VINTAGE VIBES : పాత రోజులు మళ్ళీ వచ్చేశాయ్!
-
Fulfilling Dreams: రుణం తీర్చుకున్న గురుభక్తి: పేద విద్యార్థినికి అభయమిచ్చిన ఆర్థోపెడిక్ వైద్యుడు
-
Fire Mishap on NH 44: అప్రమత్తతతో తప్పిన పెను ప్రమాదం.. 44వ జాతీయ రహదారిపై బస్సు దగ్ధం
-
TECH NEWS : వాట్సాప్లో 'బిల్ పేమెంట్స్'.. సౌలభ్యమా? ముప్పుతో కూడిన ప్రయోగమా?







