అధిక ధరలకు విక్రయాలపై ఆర్డీవోకు ఫిర్యాదు
పెద్దాపురం (రెడ్ బీ న్యూస్) పట్టణంలో కూరగాయలను వ్యాపారులు అధిక ధరలకు
విక్రయిస్తున్నారని ఆర్డీవో మల్లిబాబుకు సామాజిక కార్యకర్త గుణ్ణం లక్ష్మణరావు
బుధవారం ఫిర్యాదు చేశారు. అలాగే పట్టణంలో రైతు బజార్ లో కూరగాయాలు
కొనుగోలు చేసుకునేందుకు వెళ్లే మార్గాన్ని పోలీసులు మూసివేశారని, దీంతో సామా
న్యులు కూరగాయలు కొనుగోలు చేయాలంటే బహిరంగ మార్కెట్లో అధిక ధర
లను వెచ్చించి కొనుగోలు చేయాల్సి వస్తోందన్నారు. కనీసం పాదచారులు వెళ్లేం
దుకు కూడా మార్గం లేకుండా మూసివేశారని ఆయన ఆర్డీవో వివరించారు. రైతుబజార్ ఉన్నా నిర్వీర్యమవుతోందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. తక్షణమే అధిక ధరల
విక్రయాలపై చర్యలు తీసుకోవాలని, అలాగే రైతుబజార్‌కు వెళ్లే మార్గంలో అడ్డంకులను తొలగించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.
Related News
-
SPECIAL STORY : సామాన్యుడి చేతికి టెక్నాలజీ అస్త్రం.. రోజువారీ జీవితంలో ‘ఏఐ’ విప్లవం!
-
TTD: తిరుమల శ్రీవారి నిత్య నైవేద్య వైభవం: ప్రసాద ప్రియుడైన ఏడుకొండలవాడు
-
VINTAGE VIBES : పాత రోజులు మళ్ళీ వచ్చేశాయ్!
-
Fulfilling Dreams: రుణం తీర్చుకున్న గురుభక్తి: పేద విద్యార్థినికి అభయమిచ్చిన ఆర్థోపెడిక్ వైద్యుడు
-
Fire Mishap on NH 44: అప్రమత్తతతో తప్పిన పెను ప్రమాదం.. 44వ జాతీయ రహదారిపై బస్సు దగ్ధం
-
TECH NEWS : వాట్సాప్‌లో 'బిల్ పేమెంట్స్'.. సౌలభ్యమా? ముప్పుతో కూడిన ప్రయోగమా?







