గంగవరం (రెడ్ బీ న్యూస్) 9 డిసెంబర్ 2021: రైతులు దళారులను నమ్మి మోసపోవద్దని, ప్రభుత్వం ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలని ఎంపీపీ పల్లాల కృష్ణారెడ్డి, జడ్పీటీసీ సభ్యురాలు బేబీరత్నం సూచించారు. మండలంలోని కొత్తడలో రైతుభరోసా కేంద్రంలో ఏర్పాటుచేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని వారు గురువారం ప్రారంభించారు. అనంతరం వారు మాట్లాడుతూ ప్రభుత్వం నిర్దేశించిన నాణ్యత ప్రమాణాలు ప్రకారం రైతులు గిట్టుబాటు ధర పొందాలన్నారు. ప్రభుత్వ ఉద్దేశాన్ని వ్యవసాయ శాఖ సిబ్బంది గ్రామాల్లోని రైతులకు వివరించాలన్నారు. ఈ కార్యక్రమంలో తహశీల్దార్ శ్రీమన్నారాయణ, మండల వ్యవసాయ అధికారి సరళ, ఎంపీటీసీ ప్రభాకర్ రావు, సర్పంచ్ కామరాజు దొర, ఆర్ఐ జిలాని తదితరులు ఉన్నారు.
Related News
-
రూ.15 కోట్ల‘స్క్రబ్బర్’ స్కామ్: అంట్లు తోమే పీచు వెనుక 'రూ.1.24 లక్షల' ఆశ చూపిన ఘరానా మోసం
-
మద్యం మత్తులో రాక్షసానందం: కారుతో తొక్కిన కిరాతకులు… మృత్యువుతో పోరాడుతున్న వైద్య విద్యార్థిని
-
VIRAL NEWS: ఎరక్కపోయి చిక్కుల్లో పడ్డ చోరులు.!
-
Trust in Public Education: సర్కారీ చదువుకు జడ్జి 'పెద్ద పీట'!
-
TTD: తిరుమల క్షేత్రంలో తాపేశ్వరం భక్తబృందం పరవశం
-
Anaparthi : ఏసీ కంప్రెషర్‌లో షార్ట్ సర్క్యూట్







