సామర్లకోట,28 ఏప్రిల్ 2020(రెడ్ బి న్యూస్):
రైల్వే స్టేషన్ లోని గూడ్స్ వ్యాగన్ యార్డ్ వద్ద దిగుమతి హమాలీలు కూలి రేట్లు పెంచాలని డిమాండ్ చేస్తూ బుధవారం నిరసనకు దిగారు.సుమారు మూడు గంటల పాటు ఈనిరసన కొనసాగింది.నిరసనలో ఏఐటియుసి జిల్లా ఉపాధ్యక్షులు తాటిపాక మధు పాల్గొని యాజమాన్యం, కూలీలతో చర్చలు జరిపారు.సామర్లకోటలో దిగుమతి కోసం గూడ్స్ వ్యాగన్ ద్వారా వచ్చిన గోధుమల లోడును దిగుమతి చేయాల్సి ఉండగా హమాలీలు తమకు నూతన వేతన ఒప్పందం ప్రకారం కూలి రేట్లు చెల్లించాలని డిమాండ్ చేస్తూ యార్డు వద్ద బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు.దానితో కార్మిక యూనియన్ మధు విచ్చేసియాజమాన్యం, కూలీలతో చర్చలు జరిపారు.ఈ సందర్భంగా శ్రీలలితా ఇండస్ట్రీస్ యాజమాన్యంతో జరిపిన చర్చలు ఫలించాయి. చివరకు టన్ను రూ. 53,000 చెల్లించేందుకు ఒప్పందం కుదిరింది. దానికి ఇరువర్గాల అంగీకారానికి రాగా మూడు గంటల తర్వాత హమాలీలు దిగుమతి విధులకు పూనుకున్నారు.ఈ కార్యక్రమంలో సిపిఐ పట్టణ కార్యదర్శి పెద్దిరెడ్డి సత్యనారాయణ,జిల్లా కోశాధికారి బోడకొండ సాయి తదితరులు పాల్గొన్నారు..
Related News
-
SPECIAL STORY : సామాన్యుడి చేతికి టెక్నాలజీ అస్త్రం.. రోజువారీ జీవితంలో ‘ఏఐ’ విప్లవం!
-
TTD: తిరుమల శ్రీవారి నిత్య నైవేద్య వైభవం: ప్రసాద ప్రియుడైన ఏడుకొండలవాడు
-
VINTAGE VIBES : పాత రోజులు మళ్ళీ వచ్చేశాయ్!
-
Fulfilling Dreams: రుణం తీర్చుకున్న గురుభక్తి: పేద విద్యార్థినికి అభయమిచ్చిన ఆర్థోపెడిక్ వైద్యుడు
-
Fire Mishap on NH 44: అప్రమత్తతతో తప్పిన పెను ప్రమాదం.. 44వ జాతీయ రహదారిపై బస్సు దగ్ధం
-
TECH NEWS : వాట్సాప్లో 'బిల్ పేమెంట్స్'.. సౌలభ్యమా? ముప్పుతో కూడిన ప్రయోగమా?







