లండన్ (రెడ్ బీ న్యూస్) 1 జనవరి 2022 : డెల్టా వేరియంట్ సోకినవారితో పోల్చితే ఒమిక్రాన్ నిర్ధారణ అయినవారు ఆస్పత్రిలో చేరాల్సిన అవసరం తక్కువగా ఉంటుందని తాజాగా బ్రిటన్‌లో చేసిన ఓ అధ్యయనం వెల్లడించింది. యూకే హెల్త్ సెక్యూరిటీ ఏజెన్సీ(యూకేహెచ్‌ఎస్‌ఏ) గతేడాది నవంబర్ 22- డిసెంబర్ 26 మధ్య ఇంగ్లాండ్‌లో నమోదైన 5.28 లక్షలకుపైగా ఒమిక్రాన్ కేసులు, 5.73 లక్షల డెల్టా కేసులను విశ్లేషించి దీన్ని రూపొందించింది. డెల్టాతో పోలిస్తే ఒమిక్రాన్ సోకిన వారిలో మూడింట కేవలం ఒక వంతు వారికి మాత్రమే ఆసుపత్రిలో చేరాల్సిన పరిస్థితి రావొచ్చని పేర్కొంది. కొత్త వేరియంట్‌తో తీవ్ర అనారోగ్యం, హాస్పిటలైజేషన్ ముప్పు తక్కువేనంటూ ఇదివరకు వచ్చిన ఇతర అధ్యయనాలు, శాస్త్రవేత్తల వాదనలను తాజా అధ్యయనం మరింత బలోపేతం చేసినట్లయింది. ఒమిక్రాన్ కట్టడిలో టీకాలు బాగా పనిచేస్తాయని కూడా యూకేహెచ్‌ఏఎస్ అధ్యయనం వెల్లడించింది. దీని ప్రకారం.. ఏ టీకా తీసుకోని వారితో పోలిస్తే రెండు డోసులు వేయించుకున్న వారికి ఒమిక్రాన్ సోకితే ఆసుపత్రిలో చేరే అవకాశాలు 65 శాతం తక్కువ. అదే, బూస్టర్ డోస్ తీసుకున్నవారికి 81 శాతం తక్కువ. అయితే, ఈ అంశాలపై ఇప్పుడే ఒక నిర్ధారణకు రావడం తొందరపాటు చర్య అవుతుందని యూకేఎస్‌హెచ్‌ఏలోని చీఫ్ మెడికల్ అడ్వైజర్ సుసాన్ హాప్కిన్స్ అన్నారు. ఒమిక్రాన్ ఉద్ధృత వ్యాప్తి, ఇంగ్లాండ్‌లో 60 ఏళ్లు పైబడినవారిలో పెరుగుతున్న కేసుల కారణంగా రాబోయే వారాల్లో యూకే నేషనల్ హెల్త్ సర్వీస్‌పై తీవ్ర ఒత్తిడి పడే అవకాశం ఉందని చెప్పారు.
Related News
-
SPECIAL STORY : సామాన్యుడి చేతికి టెక్నాలజీ అస్త్రం.. రోజువారీ జీవితంలో ‘ఏఐ’ విప్లవం!
-
TTD: తిరుమల శ్రీవారి నిత్య నైవేద్య వైభవం: ప్రసాద ప్రియుడైన ఏడుకొండలవాడు
-
VINTAGE VIBES : పాత రోజులు మళ్ళీ వచ్చేశాయ్!
-
Fulfilling Dreams: రుణం తీర్చుకున్న గురుభక్తి: పేద విద్యార్థినికి అభయమిచ్చిన ఆర్థోపెడిక్ వైద్యుడు
-
Fire Mishap on NH 44: అప్రమత్తతతో తప్పిన పెను ప్రమాదం.. 44వ జాతీయ రహదారిపై బస్సు దగ్ధం
-
TECH NEWS : వాట్సాప్‌లో 'బిల్ పేమెంట్స్'.. సౌలభ్యమా? ముప్పుతో కూడిన ప్రయోగమా?







