పెద్దాపురం:31 అక్టోబరు 2020 (రెడ్ బీ న్యూస్): స్థానిక జవహర్ నవోదయ విద్యాలయంలో సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి వేడుకలను పురస్కరించుకుని ఏక్తా దివస్ వేడుకలను శనివారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపాల్ జంధ్యాల వెంకటరమణ పాల్గొన్నారు. ముందుగా సర్దార్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించి మాట్లాడారు. సర్దార్ వల్లభాయ్ పటేల్ రాజ్యాంగ రచనలో అతిముఖ్యమైన ప్రాథమిక హక్కుల కమిటీకి ఛైర్మన్ గా వ్యవహరించడంతోపాటు, స్వాతంత్ర్యానంతరం జవహార్ లాల్ నెహ్రూ నేతృత్వంలోని కేంద్రమంత్రి మండలిలో హోంశాఖ మంత్రిగా, ఉప ప్రధానమంత్రి పనిచేశారన్నారు. దేశవిభజన అనంతరం అనేక ప్రాంతాలలో జరిగిన అల్లర్లను ఎంతో చాకచక్యంతో అణచివేశారని గుర్తుచేశారు. అనంతరం విద్యార్థులకు వ్యాసరచన పోటీలను నిర్వహించి బహుమతులను అందచేశారు.
Related News
-
SPECIAL STORY : సామాన్యుడి చేతికి టెక్నాలజీ అస్త్రం.. రోజువారీ జీవితంలో ‘ఏఐ’ విప్లవం!
-
TTD: తిరుమల శ్రీవారి నిత్య నైవేద్య వైభవం: ప్రసాద ప్రియుడైన ఏడుకొండలవాడు
-
VINTAGE VIBES : పాత రోజులు మళ్ళీ వచ్చేశాయ్!
-
Fulfilling Dreams: రుణం తీర్చుకున్న గురుభక్తి: పేద విద్యార్థినికి అభయమిచ్చిన ఆర్థోపెడిక్ వైద్యుడు
-
Fire Mishap on NH 44: అప్రమత్తతతో తప్పిన పెను ప్రమాదం.. 44వ జాతీయ రహదారిపై బస్సు దగ్ధం
-
TECH NEWS : వాట్సాప్లో 'బిల్ పేమెంట్స్'.. సౌలభ్యమా? ముప్పుతో కూడిన ప్రయోగమా?







