రెడ్ బీ న్యూస్,31 డిసెంబర్ 2021: ఇప్పటికే రెండు రైల్వేస్టేషన్ల పేర్లు మార్చిన ఉత్తర్‌ప్రదేశ్ ప్రభుత్వం.. తాజాగా ఝాన్సీ రైల్వేస్టేషను పేరును ‘వీరాంగణ లక్ష్మీబాయి రైల్వేస్టేషన్’గా మార్చింది. ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ట్విటర్ ద్వారా ఈ విషయం వెల్లడించారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం నోటిఫికేషను విడుదల చేసింది. తమకు ఎలాంటి అభ్యంతరం లేదంటూ కేంద్ర హోం మంత్రిత్వ శాఖ 2021, నవంబరు 24న రాసిన లేఖను కూడా జోడించింది. ఈ క్రమంలో మార్పు ప్రక్రియ మొదలుపెట్టినట్లు ఉత్తర మధ్య రైల్వే చీఫ్ పీఆర్‌వో శివం శర్మ చెప్పారు. యోగి సర్కారు ఇప్పటికే మొఘల్‌సరాయ్ రైల్వేస్టేషను పేరును దీన్‌దయాల్ ఉపాధ్యాయ జంక్షన్‌గా, ఫైజాబాద్ రైల్వేస్టేషన్ పేరును అయోధ్య జంక్షన్‌గా మార్చింది. అలాగే.. ఫైజాబాద్, అలహాబాద్ జిల్లాల పేర్లను అయోధ్య, ప్రయాగ్‌రాజ్‌లుగా మార్పు చేసింది.
Related News
-
SPECIAL STORY : సామాన్యుడి చేతికి టెక్నాలజీ అస్త్రం.. రోజువారీ జీవితంలో ‘ఏఐ’ విప్లవం!
-
TTD: తిరుమల శ్రీవారి నిత్య నైవేద్య వైభవం: ప్రసాద ప్రియుడైన ఏడుకొండలవాడు
-
VINTAGE VIBES : పాత రోజులు మళ్ళీ వచ్చేశాయ్!
-
Fulfilling Dreams: రుణం తీర్చుకున్న గురుభక్తి: పేద విద్యార్థినికి అభయమిచ్చిన ఆర్థోపెడిక్ వైద్యుడు
-
Fire Mishap on NH 44: అప్రమత్తతతో తప్పిన పెను ప్రమాదం.. 44వ జాతీయ రహదారిపై బస్సు దగ్ధం
-
TECH NEWS : వాట్సాప్‌లో 'బిల్ పేమెంట్స్'.. సౌలభ్యమా? ముప్పుతో కూడిన ప్రయోగమా?







