డ్వామా పిడి గా రాజకుమారి బాధ్యతల స్వీకరణ

UPDATED 4th JUNE 2017 SUNDAY 7:00 PM

కాకినాడ : జిల్లా నీటి యాజమాన్య సంస్థ (డ్వామా) పథక సంచాలకులుగా జి.రాజకుమారి శనివారం బాధ్యతలు స్వీకరించారు. విజయనగరం జిల్లా జెడ్పి సిఇవో గా పనిచేస్తున్న ఆమెను ఇక్కడ డ్వామా పిడి గా ప్రభుత్వం నియమించింది. ఇప్పటి వరకూ జిల్లాలో డ్వామా పిడి గా పనిచేస్తున్న ఎ. నాగేశ్వరారావు నుంచి ఆమె బాధ్యతలు స్వీకరించారు. 2009 సంవత్సరంలో రాజకుమారి ప్రభుత్వ సర్వీసులో చేశారు. విజయనగరం, పాడేరు ఆర్డీవోగా కూడా గతంలో పనిచేశారు. శనివారం కాకినాడ వచ్చిన ఆమె ముందుగా కలెక్టరేట్‌లో రాష్ట్ర ఉపముఖ్యమంత్రి, హోం మంత్రి నిమ్మకాయల రాజప్పను మర్యాద పూర్వకంగా కలిశారు. జిల్లా కలెక్టర్‌ కార్తికేయ మిశ్రాను కలిసిన అనంతరం ఆమె డ్వామా పిడిగా  విధుల్లో చేరారు. ఈ సందర్భంగా ఆమె విలేఖరులుతో మాట్లాడుతూ జాతీయ ఉపాధి హామీ పథకం అనుసంధానంతో అనేక కార్యక్రమాలు జరుగుతున్నాయని, వీటిని పూర్తిస్థాయిలో అమలు చేయటానికి కృషి చేస్తానని చెప్పారు. ఉపాధి కూలీల వేతనాలు, పనిదినాల పెంపునకు పాటుపడతానన్నారు. జిల్లాను జాతీయ ఉపాధి హామీ పథకంలో రాష్ట్రంలో మొదటి స్థానంలో నిలపటానికి కృషి చేస్తానని తెలిపారు.

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us