గంగవరం (రెడ్ బీ న్యూస్) 10 నవంబర్ 2021: మండలంలోని కొమరవరంలో మంగళవారం అర్ధరాత్రి సంభవించిన అగ్ని ప్రమాదంలో తాటాకు ఇల్లు అగ్నికి ఆహుతి అయింది. కొమరవరంకు చెందిన మిరియాల చిన్నాలు దొర ఇల్లు అగ్ని ప్రమాదానికి గురికావడంతో సుమారు రూ. లక్ష ఆస్తి నష్టం సంభవించినట్లు రెవిన్యూ ఇనస్పెక్టర్ జిలాని తెలిపారు. బాధిత కుటుంబానికి రెవెన్యూ శాఖ తక్షణ సహాయంగా బియ్యం, నిత్యావసరాలను బుధవారం అందజేశారు. అలాగే సంఘటనా స్థలాన్ని మాజీ ఎంపీపీ డాక్టర్ తీగల ప్రభ ఆధ్వర్యంలో టీడీపీ నాయకులు వెంకట్ రెడ్డి, బద్రి ఈశ్వర్ రెడ్డి, పండు దొర, రాజన్నదొర తదితరులు బాధిత కుటుంబాన్ని పరామర్శించి 50 కేజీల బియ్యం నిత్యావసరాలను అందజేశారు.
Related News
-
రూ.15 కోట్ల‘స్క్రబ్బర్’ స్కామ్: అంట్లు తోమే పీచు వెనుక 'రూ.1.24 లక్షల' ఆశ చూపిన ఘరానా మోసం
-
మద్యం మత్తులో రాక్షసానందం: కారుతో తొక్కిన కిరాతకులు… మృత్యువుతో పోరాడుతున్న వైద్య విద్యార్థిని
-
VIRAL NEWS: ఎరక్కపోయి చిక్కుల్లో పడ్డ చోరులు.!
-
Trust in Public Education: సర్కారీ చదువుకు జడ్జి 'పెద్ద పీట'!
-
TTD: తిరుమల క్షేత్రంలో తాపేశ్వరం భక్తబృందం పరవశం
-
Anaparthi : ఏసీ కంప్రెషర్‌లో షార్ట్ సర్క్యూట్







