పుంగనూరు (రెడ్ బీ న్యూస్) 12 డిసెంబర్ 2021: తమిళనాడులో జరిగిన హెలికాప్టర్ దుర్ఘటనలో ప్రాణాలు కోల్పోయిన లాన్స్ నాయక్ సాయితేజ పార్థివదేహాన్ని ఆయన స్వగ్రామం ఎగువరేగడకు తరలించారు. బెంగళూరులో సైన్యానికి చెందిన కమాండ్ ఆస్పత్రి నుంచి సాయితేజ భౌతికకాయాన్ని చిత్తూరు జిల్లా సరిహద్దు చీకలబైలు చెక్‌పోస్ట్.. వలసపల్లి మీదుగా ఎగువరేగడకు రోడ్డు మార్గంలో సుమారు 30 కి.మీ మేర భారీ ర్యాలీగా తీసుకెళ్తున్నారు. ఈ ర్యాలీలో సాయితేజ బంధువులు, స్నేహితులు, పెద్ద ఎత్తున విద్యార్థులు, పలువురు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. సాయితేజ భౌతికకాయం ఎగువరేగడకు చేరిన అనంతరం సైనిక లాంఛనాలతో అక్కడ అంతిమ సంస్కారాలు పూర్తి చేయనున్నారు.
Related News
-
SPECIAL STORY : సామాన్యుడి చేతికి టెక్నాలజీ అస్త్రం.. రోజువారీ జీవితంలో ‘ఏఐ’ విప్లవం!
-
TTD: తిరుమల శ్రీవారి నిత్య నైవేద్య వైభవం: ప్రసాద ప్రియుడైన ఏడుకొండలవాడు
-
VINTAGE VIBES : పాత రోజులు మళ్ళీ వచ్చేశాయ్!
-
Fulfilling Dreams: రుణం తీర్చుకున్న గురుభక్తి: పేద విద్యార్థినికి అభయమిచ్చిన ఆర్థోపెడిక్ వైద్యుడు
-
Fire Mishap on NH 44: అప్రమత్తతతో తప్పిన పెను ప్రమాదం.. 44వ జాతీయ రహదారిపై బస్సు దగ్ధం
-
TECH NEWS : వాట్సాప్లో 'బిల్ పేమెంట్స్'.. సౌలభ్యమా? ముప్పుతో కూడిన ప్రయోగమా?







