గంగవరం (రెడ్ బీ న్యూస్) 25 నవంబర్ 2021: రోడ్డు ప్రమాదంలో గాయాలపాలై మృతి చెందిన ఏటిపల్లి ఆశా కార్యకర్త చిన్నారి కుటుంబానికి న్యాయం జరిగే వరకు విధులు బహిష్కరిస్తున్నట్లు గంగవరం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలో ఆశా కార్యకర్తలు గురువారం పీహెచ్సీ వైద్యాధికారి డాక్టర్ ఆనంద్ సత్యతేజకు నోటీసు అందజేశారు. తమ డిమాండ్లు పరిష్కారం కోసం ఆందోళన చేపట్టేందుకు ప్రతి పీహెచ్సీలో అనుమతిస్తున్న గంగవరంలో మాత్రం అనుమతి ఇవ్వకపోగా తీవ్ర ఒత్తిడికి గురి చేస్తున్నారని ఆరోపించారు. చిన్నారి కుటుంబానికి న్యాయం జరిగే వరకు విధులకు బహిష్కరిస్తున్నట్లు 33 మంది ఆశా కార్యకర్తలు లిఖితపూర్వకంగా వైద్యాధికారికి నోటీసు అందజేశారు ఈకార్యక్రమంలో గంగవరం పీహెచ్సీ పరిధిలోగల ఆశ కార్యకర్తలు పాల్గొన్నారు.
Related News
-
SPECIAL STORY : సామాన్యుడి చేతికి టెక్నాలజీ అస్త్రం.. రోజువారీ జీవితంలో ‘ఏఐ’ విప్లవం!
-
TTD: తిరుమల శ్రీవారి నిత్య నైవేద్య వైభవం: ప్రసాద ప్రియుడైన ఏడుకొండలవాడు
-
VINTAGE VIBES : పాత రోజులు మళ్ళీ వచ్చేశాయ్!
-
Fulfilling Dreams: రుణం తీర్చుకున్న గురుభక్తి: పేద విద్యార్థినికి అభయమిచ్చిన ఆర్థోపెడిక్ వైద్యుడు
-
Fire Mishap on NH 44: అప్రమత్తతతో తప్పిన పెను ప్రమాదం.. 44వ జాతీయ రహదారిపై బస్సు దగ్ధం
-
TECH NEWS : వాట్సాప్లో 'బిల్ పేమెంట్స్'.. సౌలభ్యమా? ముప్పుతో కూడిన ప్రయోగమా?







