ATM ROBBERY : చెన్నైలో భారీ ఏటీఎం దోపిడీ

UPDATED 26 AUGUST 2026 4:00 PM

గ్యాస్‌కట్టర్లతో రూ.9 లక్షలు లూటీ

​పక్కా వ్యూహం ముందుగానే సీసీ కెమెరాలు, అలారం తొలగింపు.

​ఉత్తరాది ముఠా ప్రమేయంపై పోలీసుల అనుమానం

చెన్నై, రెడ్ బీ న్యూస్, ఆగష్టు 26: చెన్నై శ్రీపెరంబుదూరు సమీపంలోని మంగళవారం ప్రాంతంలో దొంగలు అత్యంత చాకచక్యంగా ఎటీఎంను దోచుకున్నారు. పుదుపేర్ ప్రాంతంలోని ఒక వాణిజ్య భవనంలో ఉన్న ఎఎటీఎంలో మంగళవారం వేకువజామున 4 గంటలకు ఈ ఘటన చోటుచేసుకుంది. దుండగులు గునపాలు, గ్యాస్ కట్టర్లను ఉపయోగించి ఎటీఎం యంత్రాన్ని ధ్వంసం చేసి సుమారు రూ.9 లక్షల నగదును దోచుకెళ్లారు.

​ఈ దోపిడీకి ముందు నిందితులు పక్కాగా పథకం రచించినట్లు స్పష్టమవుతోంది. ఎటీఎం కేంద్రంలోని సీసీ కెమెరాలు, అలారాన్ని వారు ముందుగానే తొలగించారు. సీసీటీవీ కంట్రోలింగ్ రూమ్ విజువల్స్‌లో ముఖానికి ముసుగు ధరించిన ఒకే ఒక నిందితుడు కనిపించాడు. యంత్రాన్ని కట్ చేయడానికి గ్యాస్ కట్టర్లు వాడటంతో ఈ ఘాతుకానికి పాల్పడింది ఉత్తరాది రాష్ట్రాలకు చెందిన ముఠా అయి ఉంటుందని పోలీసులు అనుమానిస్తున్నారు. ఉదయం 8 గంటలకు పాదచారులు ఈ విషయాన్ని గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేయగా, తాంబరం డీసీపీ కార్తికేయన్, మణిమంగళం ఏసీపీ సుందర్ తదితరులు ఘటనా స్థలాన్ని పరిశీలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us