గంగవరం (రెడ్ బీ న్యూస్) డిసెంబర్ 2021 : ఉద్యోగులకు చేసిన సేవలే గుర్తింపునిస్తాయని, అలాగే పదవీ విరమణ సహజమని ఎంపీపీ పల్లాల కృష్ణారెడ్డి, జడ్పీటీసీ సభ్యురాలు బేబీ రత్నం అన్నారు. మండలంలో పంచాయతీరాజ్ విస్తరణాధికారిగా పనిచేస్తూ పదవీ విరమణ చేసిన వర్రే శివరామకృష్ణ వీడ్కోలు సభకు ఎంపీడీవో జాన్ మిల్టన్ అధ్యక్షత వహించగా ఎంపీపీ, జడ్పీటీసీలు ముఖ్య అతిథిలుగా హాజరై శివరామకృష్ణ దంపతులను సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన సేవలను పలువురు కొనియాడారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీలు వెంకటలక్ష్మి, కె.ఎస్ ప్రభాకరరావు, కనకలక్ష్మి, ఉపాధిహామీ ఏపివో సురేష్ కుమార్, పలువురు సర్పంచులు పంచాయతీ కార్యదర్శులు, సచివాలయ, రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు.
Related News
-
SPECIAL STORY : సామాన్యుడి చేతికి టెక్నాలజీ అస్త్రం.. రోజువారీ జీవితంలో ‘ఏఐ’ విప్లవం!
-
TTD: తిరుమల శ్రీవారి నిత్య నైవేద్య వైభవం: ప్రసాద ప్రియుడైన ఏడుకొండలవాడు
-
VINTAGE VIBES : పాత రోజులు మళ్ళీ వచ్చేశాయ్!
-
Fulfilling Dreams: రుణం తీర్చుకున్న గురుభక్తి: పేద విద్యార్థినికి అభయమిచ్చిన ఆర్థోపెడిక్ వైద్యుడు
-
Fire Mishap on NH 44: అప్రమత్తతతో తప్పిన పెను ప్రమాదం.. 44వ జాతీయ రహదారిపై బస్సు దగ్ధం
-
TECH NEWS : వాట్సాప్లో 'బిల్ పేమెంట్స్'.. సౌలభ్యమా? ముప్పుతో కూడిన ప్రయోగమా?







