హైదరాబాద్ (రెడ్ బీ న్యూస్) 12 డిసెంబర్ 2021: పెట్టుబడుల ముసుగులో కోట్లాది రూపాయలు వసూలు చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న శిల్పాచౌదరి కేసులో పోలీస్ కస్టడీ ముగిసింది. మూడ్రోజుల కస్టడీ ముగియడంతో సోమవారం ఉదయం కోర్టులో ప్రవేశపెట్టనున్నారు. విచారణ సందర్భంగా శిల్పా చౌదరి నుంచి నార్సింగ్ పోలీసులు పలు వివరాలు సేకరించారు. ఆమె ఖాతాలో రూ.16వేలు, భర్త శ్రీనివాస్ ప్రసాద్ ఖాతాలో రూ.14వేలు ఉన్నట్టు పోలీసులు గుర్తించారు. శిల్ప ఇప్పటి వరకు రూ.కోట్లలో మోసం చేసినట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. 3 కేసుల్లో రూ.7కోట్లు మోసం చేసినట్టు ఆమెపై బాధితులు ఫిర్యాదు చేశారు. ముగ్గురికీ రూ.7కోట్లు తిరిగిచ్చేస్తానని శిల్పాచౌదరి పోలీసులకు చెప్పినట్టు సమాచారం. దివ్యారెడ్డి, ప్రియదర్శిని, రేణుకారెడ్డిల నుంచి శిల్ప రూ.7కోట్లకు పైగా తీసుకొని ఎగవేసినట్టు పోలీసులు కేసు నమోదు చేశారు. శిల్ప అమెరికాలో మూడేళ్లపాటు ఓ సాఫ్ట్‌వేర్ కంపెనీలో పనిచేసినట్టు పోలీసుల దర్యాప్తులో తేలింది. అమెరికా నుంచి భారత్‌కు వచ్చి మోసాలకు పాల్పడినట్టు గుర్తించారు. రాధికారెడ్డికి రూ.10కోట్లకు పైగా ఇచ్చినట్టు శిల్ప చెప్పినప్పటికీ తగిన ఆధారాలు ఇవ్వలేదు. ఆమె మోసాలపై నార్సింగ్ పోలీసులు మరిన్ని ఆధారాలు సేకరిస్తున్నారు.
Related News
-
SPECIAL STORY : సామాన్యుడి చేతికి టెక్నాలజీ అస్త్రం.. రోజువారీ జీవితంలో ‘ఏఐ’ విప్లవం!
-
TTD: తిరుమల శ్రీవారి నిత్య నైవేద్య వైభవం: ప్రసాద ప్రియుడైన ఏడుకొండలవాడు
-
VINTAGE VIBES : పాత రోజులు మళ్ళీ వచ్చేశాయ్!
-
Fulfilling Dreams: రుణం తీర్చుకున్న గురుభక్తి: పేద విద్యార్థినికి అభయమిచ్చిన ఆర్థోపెడిక్ వైద్యుడు
-
Fire Mishap on NH 44: అప్రమత్తతతో తప్పిన పెను ప్రమాదం.. 44వ జాతీయ రహదారిపై బస్సు దగ్ధం
-
TECH NEWS : వాట్సాప్లో 'బిల్ పేమెంట్స్'.. సౌలభ్యమా? ముప్పుతో కూడిన ప్రయోగమా?







