గంగవరం (రెడ్ బీ న్యూస్)15 డిసెంబర్ 2021: రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన ఆశావర్కర్ ముర్ల చిన్నారి కుటుంబాన్ని ఆదుకోవాలని డిమాండ్ చేస్తూ గంగవరం పీహెచ్సీ ఎదుట సీఐటీయూ ఆంధ్రప్రదేశ్ ఆశా వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో ఆశా కార్యకర్తలు చేపట్టిన రిలే నిరాహార దీక్షలు బుధవారానికి రెండో రోజుకు చేరుకున్నాయి. ఈ దీక్షా శిబిరానికి యూటీఎఫ్ మండలశాఖ సంపూర్ణ మద్దతు ప్రకటించారు. బుధవారం సాయంత్రం యూటీఎఫ్ నాయకులు దీక్షా శిబిరాన్ని చేరుకొని ఆశా వర్కర్లకు యూటీఎఫ్ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. యూటీఎఫ్ జిల్లా కార్యదర్శి కృష్ణ మాట్లాడుతూ ఆశ కార్యకర్త చిన్నారి మృతి చెంది నెల రోజులు కావస్తున్నా ప్రభుత్వం నుంచి ఎటువంటి సహకారం లేదని, గౌరవ వేతనం పేరుతో రూ.10 చెల్లిస్తామని రూ. 6,600 మాత్రమే చెల్లించడం చాలా అన్యాయమన్నారు. గౌరవ వేతనం పేరుతో ఆశ కార్యకర్తల కుటుంబాలకు అమ్మఒడి, జగనన్న చేయూత, రేషన్ కార్డు వంటి ప్రభుత్వ సహాయాన్ని తొలగించడం దారుణమని ఆయన అన్నారు. దీక్షా శిబిరం సందర్శించిన వారిలో యూటీఎఫ్ మండల గౌరవ అధ్యక్షుడు పి.రాంబాబు అధ్యక్ష కార్యదర్శులు రఘుబాబు దొర, రాంబాబు దొర, జిల్లా కౌన్సిలర్ శ్రీనివాస్ రెడ్డి, బాబురావు, రుక్మిణిదేవి, నాగమణి, లక్ష్మీ తదితరులు ఉన్నారు.
Related News
-
SPECIAL STORY : సామాన్యుడి చేతికి టెక్నాలజీ అస్త్రం.. రోజువారీ జీవితంలో ‘ఏఐ’ విప్లవం!
-
TTD: తిరుమల శ్రీవారి నిత్య నైవేద్య వైభవం: ప్రసాద ప్రియుడైన ఏడుకొండలవాడు
-
VINTAGE VIBES : పాత రోజులు మళ్ళీ వచ్చేశాయ్!
-
Fulfilling Dreams: రుణం తీర్చుకున్న గురుభక్తి: పేద విద్యార్థినికి అభయమిచ్చిన ఆర్థోపెడిక్ వైద్యుడు
-
Fire Mishap on NH 44: అప్రమత్తతతో తప్పిన పెను ప్రమాదం.. 44వ జాతీయ రహదారిపై బస్సు దగ్ధం
-
TECH NEWS : వాట్సాప్లో 'బిల్ పేమెంట్స్'.. సౌలభ్యమా? ముప్పుతో కూడిన ప్రయోగమా?







