Pawan Kalyan: వైసీపీకి వచ్చే ఎన్నికల్లో ఎన్ని సీట్లు వస్తాయో చెప్పిన పవన్

UPDATED 18th SEPTEMBER 2022 SUNDAY 01:30 PM

Pawan Kalyan: వచ్చే ఎన్నికల్లో అధికారపార్టీ వైసీపీ (YCP) ఎన్ని సీట్లు గెలవబోతోందనే విషయంపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ (Pawan kalyan) జోస్యం చెప్పారు. ఆదివారం మంగళగిరిలో జరిగిన జనసేన లీగల్‌సెల్ సమావేశం (Janasena Legal Cell meeting)లో మాట్లాడుతూ... ఓ సర్వే ప్రకారం వచ్చే ఎన్నికల్లో (Elections) వైసీపీకి 47-67 స్థానాలు వచ్చే అవకాశం ఉందని తెలిపారు. వైసీపీ ఇచ్చిన హామీలు నెరవేర్చలేదని విమర్శించారు. హామీలు నెరవేర్చని తమకు చట్టాలు చేసే అధికారం ఎక్కడిదని ప్రశ్నించారు.

సమస్యలపై ప్రశ్నించేందుకు వేదిక కావాలని అనిపించిందన్నారు. ప్రశ్నించేందుకు, సేవ చేసేందుకే పార్టీ స్థాపించినట్లు వివరించారు. గెలిచేవరకు మళ్లీ మళ్లీ దెబ్బలు తినడానికి సిద్ధమని స్పష్టం చేశారు. తన జీవితంలో చేసిన మంచి పని పార్టీ పెట్టడమన్నారు. 2019లో ప్రజలు ఏ ఉద్దేశంతో వైసీపీకి ఓటు వేశారో గానీ.. దాని పర్యావసానం ఇప్పుడు అనుభవిస్తున్నారని పవన్ కల్యాణ్‌ (Janasena chief) అన్నారు.

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us