పెద్దాపురం (రెడ్ బీ న్యూస్) 26 నవంబర్ 2021: రాజ్యాంగ దినోత్సవం సందర్బంగా తూర్పుగోదావరి జిల్లా పెద్దాపురం పట్టణంలో ప్రజా సంఘాల ఆధ్వర్యంలో 75 మీటర్ల జాతీయ జెండా ప్రదర్శన నిర్వహించారు. స్థానిక లూధరన్ ఉన్నత పాఠశాల నుంచి ప్రారంభమైన ఈ ప్రదర్శనను పెద్దాపురం సబ్ ఇనస్పెక్టర్ ఆర్.మురళీమెాహన్ జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ రాజ్యాంగ దినోత్సవాన్ని మనం స్మరించుకోవడం అంటే భారతదేశ సార్వభౌమాదికారాన్ని కాపాడుకోవడం కృషి చేయ్యడం అన్నారు. లౌకిక భారతాన్ని, ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించుకోవడానికి మనందరం కృషి చేయాలన్నారు. రాజ్యాంగంలోని ప్రతి అంశాన్ని పుట్టిన దగ్గర నుంచి మరణించేవరకూ మనం ఆచరిస్తూ ఉంటామని, భావ ప్రకటనా స్వేచ్చని, వాక్ స్వాతంత్ర్యాన్ని, పత్రికా స్వేచ్చని మనకు రాజ్యాంగం అందించిందని అన్నారు. ఈ ప్రదర్శన మార్గంలో రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్, గాంధీ విగ్రహానికి పూలమాల వేసి నివాళ్ళు అర్పించారు. ప్రదర్శనలో విద్యార్దులు, కార్మిక సంఘాల సభ్యులు, యువకులు పాల్గోన్నారు.
Related News
-
రూ.15 కోట్ల‘స్క్రబ్బర్’ స్కామ్: అంట్లు తోమే పీచు వెనుక 'రూ.1.24 లక్షల' ఆశ చూపిన ఘరానా మోసం
-
మద్యం మత్తులో రాక్షసానందం: కారుతో తొక్కిన కిరాతకులు… మృత్యువుతో పోరాడుతున్న వైద్య విద్యార్థిని
-
VIRAL NEWS: ఎరక్కపోయి చిక్కుల్లో పడ్డ చోరులు.!
-
Trust in Public Education: సర్కారీ చదువుకు జడ్జి 'పెద్ద పీట'!
-
TTD: తిరుమల క్షేత్రంలో తాపేశ్వరం భక్తబృందం పరవశం
-
Anaparthi : ఏసీ కంప్రెషర్‌లో షార్ట్ సర్క్యూట్







