సామర్లకోట: 7 జూన్ 2020 (రెడ్ బీ న్యూస్):
క్రీడాకారులకు మెరుగైన సౌకర్యాలు కల్పించనున్నట్లు వైఎస్ఆర్సీపీ పెద్దాపురం నియోజకవర్గ కోఆర్డినేటర్ దవులూరి దొరబాబు అన్నారు. స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానాన్ని ఆయన ఆదివారం సందర్శించారు. మైదానంలో క్రీడలు ఆడేందుకు వీలులేకుండా ఫెన్సింగ్ వేస్తుండడంతో పలువురు క్రీడాకారులు దొరబాబు ఫిర్యాదు చేశారు. దీంతో ఆయన కళాశాల క్రీడా మైదానాన్ని పరిశీలించారు. స్థానికంగా సాధన చేస్తున్న రాష్ట్రస్థాయి క్రీడాకారులు ఎంతమంది ఉన్నారు అనే విషయంపై దొరబాబు ఆరా తీశారు. క్రీడాకారులకు ఇబ్బందులు కలిగించవద్దని ఆదేశించారు. అయితే గ్రౌండ్స్ లో వాకింగ్ ట్రాక్ ఏర్పాటు చేస్తున్నామని, దీని వలన క్రికెట్ పీచ్ కు ఎటువంటి ఇబ్బందులు ఉండవని కోచ్ ప్రసాద్ వివరించారు. క్రికెట్ పిచ్ ను సైతం శాశ్వత ప్రాతిపదికన ఏర్పాటు చేసే బాధ్యత తనదిగా దొరబాబు హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో సీనియర్ క్రీడాకారులు అవాల లక్ష్మీనారాయణ, ట్రాఫిక్ ఎస్ఐ బాలాజీ రాజా, రవి, సురేష్, శివ, మనోజ్, పవన్, బద్రి, నాగు, శివ, చిట్టి, పవన్, సాంబ జనార్ధన్, బన్ను, వాకర్స్ అసోసియేషన్ అధ్యక్షులు థామస్, వైసీపీ నాయకుడు సల్లూరి కళ్యాణ్, పాలక చంటిబాబు, జట్లా మోహన్, పి. లోవరాజు తదితరులు పాల్గొన్నారు.
Related News
-
SPECIAL STORY : సామాన్యుడి చేతికి టెక్నాలజీ అస్త్రం.. రోజువారీ జీవితంలో ‘ఏఐ’ విప్లవం!
-
TTD: తిరుమల శ్రీవారి నిత్య నైవేద్య వైభవం: ప్రసాద ప్రియుడైన ఏడుకొండలవాడు
-
VINTAGE VIBES : పాత రోజులు మళ్ళీ వచ్చేశాయ్!
-
Fulfilling Dreams: రుణం తీర్చుకున్న గురుభక్తి: పేద విద్యార్థినికి అభయమిచ్చిన ఆర్థోపెడిక్ వైద్యుడు
-
Fire Mishap on NH 44: అప్రమత్తతతో తప్పిన పెను ప్రమాదం.. 44వ జాతీయ రహదారిపై బస్సు దగ్ధం
-
TECH NEWS : వాట్సాప్లో 'బిల్ పేమెంట్స్'.. సౌలభ్యమా? ముప్పుతో కూడిన ప్రయోగమా?







