గంగవరం (రెడ్ బీ న్యూస్) 17 డిసెంబర్ 2021: స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రం అనుబంధంగా విధులు నిర్వహిస్తున్న ఒక ఉద్యోగికి శుక్రవారం కొవిడ్ టెస్ట్ లో పాజిటివ్ గా నిర్ధారణ అయ్యింది. దీంతో గంగవరంలో ప్రజలు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. ఇటీవల మండలంలో కొవిడ్ కేసులు లేకపోవడంతో ఊపిరిపీల్చుకున్న ప్రజలకు మళ్లీ కోవిడ్ కేసు రావడంతో ఆందోళన చెందుతున్నారు. ఈ నేపథ్యంలో ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని తాహశీల్దార్ శ్రీమన్నారాయణ కోరారు. ప్రతి ఒక్కరు తప్పనిసరిగా మాస్కులు ధరించడంతో పాటు భౌతిక దూరం పాటించాలన్నారు. అనుమానిత లక్షణాలు ఉన్న ప్రతి ఒక్కరు తప్పనిసరిగా కొవిడ్ టెస్ట్ చేయించుకోవలన్నారు. త్వరలోనే కివిడ్ టాస్క్ ఫోర్స్ సమావేశం నిర్వహించి తగిన జాగ్రత్తలు తీసుకోవడం జరుగుతుందని ఆయన తెలిపారు.
Related News
-
SPECIAL STORY : సామాన్యుడి చేతికి టెక్నాలజీ అస్త్రం.. రోజువారీ జీవితంలో ‘ఏఐ’ విప్లవం!
-
TTD: తిరుమల శ్రీవారి నిత్య నైవేద్య వైభవం: ప్రసాద ప్రియుడైన ఏడుకొండలవాడు
-
VINTAGE VIBES : పాత రోజులు మళ్ళీ వచ్చేశాయ్!
-
Fulfilling Dreams: రుణం తీర్చుకున్న గురుభక్తి: పేద విద్యార్థినికి అభయమిచ్చిన ఆర్థోపెడిక్ వైద్యుడు
-
Fire Mishap on NH 44: అప్రమత్తతతో తప్పిన పెను ప్రమాదం.. 44వ జాతీయ రహదారిపై బస్సు దగ్ధం
-
TECH NEWS : వాట్సాప్లో 'బిల్ పేమెంట్స్'.. సౌలభ్యమా? ముప్పుతో కూడిన ప్రయోగమా?







