అమరావతి (రెడ్ బీ న్యూస్) 16 జనవరి 2022: కరోనా వ్యాప్తి నేపథ్యంలో తెలంగాణలో పాఠశాలలకు ఈనెల 30 వరకూ సెలవులు పొడిగించడంతో.. ఏపీలో పాఠశాలలకు సెలవులు పొడిగింపుపై విద్యాశాఖలో విస్తృతంగా చర్చ జరుగుతోంది. దీనిపై సోమవారం కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఏపీలో కరోనా పాజిటివ్ రేట్ ఇప్పటికే 13.87 శాతానికి చేరడంతో పిల్లల తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. రానున్న రోజుల్లో కేసులు మరింత పెరుగుతాయని వైద్యులు చెపుతున్నారు. దీంతో పాఠశాలలో విద్యనభ్యసిస్తున్న విద్యార్ధుల ఆరోగ్యంపై సర్వత్రా ఆందోళన నెలకొంది. వారికి ఇంకా వ్యాక్సినేషన్ పూర్తికానందున పాఠశాలలు నడిపే విషయంలో విద్యాశాఖ అధికారులు తర్జన బర్జన పడుతున్నారు. ఒకవేళ పాఠశాలలు కొనసాగిస్తే ఎక్కడైనా కేసులు వెలుగు చూస్తే ఏం చేయాలనే దానిపై కూడా చర్చలు జరుపుతున్నారు.
Related News
-
SPECIAL STORY : సామాన్యుడి చేతికి టెక్నాలజీ అస్త్రం.. రోజువారీ జీవితంలో ‘ఏఐ’ విప్లవం!
-
TTD: తిరుమల శ్రీవారి నిత్య నైవేద్య వైభవం: ప్రసాద ప్రియుడైన ఏడుకొండలవాడు
-
VINTAGE VIBES : పాత రోజులు మళ్ళీ వచ్చేశాయ్!
-
Fulfilling Dreams: రుణం తీర్చుకున్న గురుభక్తి: పేద విద్యార్థినికి అభయమిచ్చిన ఆర్థోపెడిక్ వైద్యుడు
-
Fire Mishap on NH 44: అప్రమత్తతతో తప్పిన పెను ప్రమాదం.. 44వ జాతీయ రహదారిపై బస్సు దగ్ధం
-
TECH NEWS : వాట్సాప్లో 'బిల్ పేమెంట్స్'.. సౌలభ్యమా? ముప్పుతో కూడిన ప్రయోగమా?







