విజయవాడ (రెడ్ బీ న్యూస్) 6 డిసెంబర్ 2021: ప్రభుత్వోద్యోగుల డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ ఏపీ ఐకాస, ఏపీ ఐకాస అమరావతి సంయుక్తంగా ఆందోళనలు చేపట్టనున్నట్లు ఏపీ ఎన్జీవో పశ్చిమ కృష్ణా అధ్యక్షుడు ఎ.విద్యాసాగర్ వెల్లడించారు. రాష్ట్రవ్యాప్త నిరసనల్లో భాగంగా ఈ నెల 7న ఆందోళన కార్యక్రమాలు ప్రారంభమవుతాయన్నారు. 21న అన్ని జిల్లా కేంద్రాల్లో ధర్నాలు, విజయవాడలో వేలాది మందితో మహా ధర్నా నిర్వహిస్తున్నట్లు వివరించారు. ఆదివారం విజయవాడలో ఆయన విలేకర్లతో మాట్లాడారు. ఉద్యోగులు, పింఛనర్ల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లేందుకు రాష్ట్రంలో 13 లక్షల మంది ఉద్యోగులు సమాయత్తమయ్యారని చెప్పారు.
Related News
-
SPECIAL STORY : సామాన్యుడి చేతికి టెక్నాలజీ అస్త్రం.. రోజువారీ జీవితంలో ‘ఏఐ’ విప్లవం!
-
TTD: తిరుమల శ్రీవారి నిత్య నైవేద్య వైభవం: ప్రసాద ప్రియుడైన ఏడుకొండలవాడు
-
VINTAGE VIBES : పాత రోజులు మళ్ళీ వచ్చేశాయ్!
-
Fulfilling Dreams: రుణం తీర్చుకున్న గురుభక్తి: పేద విద్యార్థినికి అభయమిచ్చిన ఆర్థోపెడిక్ వైద్యుడు
-
Fire Mishap on NH 44: అప్రమత్తతతో తప్పిన పెను ప్రమాదం.. 44వ జాతీయ రహదారిపై బస్సు దగ్ధం
-
TECH NEWS : వాట్సాప్లో 'బిల్ పేమెంట్స్'.. సౌలభ్యమా? ముప్పుతో కూడిన ప్రయోగమా?







