సికింద్రాబాద్ (రెడ్ బీ న్యూస్) 7 డిసెంబర్ 2021: సహజ ఇంధన పరిరక్షణ, అందుబాటులో ఉన్న ఇంధన వనరులను సమర్థంగా వినియోగించినందుకు దక్షిణ మధ్య రైల్వేకు నాలుగు జాతీయ అవార్డులు దక్కాయి. భారత బ్యూరో ఆఫ్ ఎనర్జీ ఎఫీషియన్సీ, విద్యుత్ మంత్రిత్వశాఖ అవార్డులను ప్రకటించింది. 2021కి గాను పలు కేటగిరీల్లో నాలుగు అవార్డులను దక్షిణ మధ్య రైల్వే సాధించింది. భవనాల కేటగిరిలో ఆసుపత్రుల విభాగం కింద విజయవాడ డివిజినల్ రైల్వే ఆసుపత్రి మొదటి బహుమతి సాధించింది. సంస్థల కేటగిరిలో కాచిగూడ స్టేషన్ చారిత్రక కట్టడానికి మొదటి బహుమతి దక్కింది. సంస్థల కేటగిరిలో విజయవాడ ఎలక్ట్రిక్ ట్రాక్షన్ ట్రైనింగ్ సెంటర్ రెండవ బహుమతి సాధించింది. సంస్థల కేటగిరిలో సికింద్రాబాద్ డివిజన్ ప్రధాన కార్యాలయ భవనం ‘సంచాలన్ భవన్’కు మెరిట్ సర్టిఫికెట్ లభించింది. ఈనెల 14 నుంచి 21 వరకు జరిగే జాతీయ ఇంధన పొదుపు వారోత్సవాల సందర్భంగా అవార్డులను అందజేయనున్నారు. ప్రతిష్టాత్మక అవార్డులు సాధించడంలో కృషి చేసిన అధికారును దక్షిణమధ్య రైల్వే జీఎం గజానన్ మాల్యా అభినందించారు.
Related News
-
SPECIAL STORY : సామాన్యుడి చేతికి టెక్నాలజీ అస్త్రం.. రోజువారీ జీవితంలో ‘ఏఐ’ విప్లవం!
-
TTD: తిరుమల శ్రీవారి నిత్య నైవేద్య వైభవం: ప్రసాద ప్రియుడైన ఏడుకొండలవాడు
-
VINTAGE VIBES : పాత రోజులు మళ్ళీ వచ్చేశాయ్!
-
Fulfilling Dreams: రుణం తీర్చుకున్న గురుభక్తి: పేద విద్యార్థినికి అభయమిచ్చిన ఆర్థోపెడిక్ వైద్యుడు
-
Fire Mishap on NH 44: అప్రమత్తతతో తప్పిన పెను ప్రమాదం.. 44వ జాతీయ రహదారిపై బస్సు దగ్ధం
-
TECH NEWS : వాట్సాప్లో 'బిల్ పేమెంట్స్'.. సౌలభ్యమా? ముప్పుతో కూడిన ప్రయోగమా?







