అమలాపురం: 21 జూన్ 2020(రెడ్ బీ న్యూస్): కోనసీమలో కరోనా తొలి మరణం సంభవించింది. 55 ఏళ్ల ఎన్టీపీసీ ఉద్యోగి తీవ్రమైన కొవిడ్ లక్షణాలతో అమలాపురంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతి చెందారు. కుటుంబ సభ్యులు అందరూ ఉన్నా ఆయన భౌతికకాయానికి మునిసిపల్ సిబ్బంది పట్టణంలోని శ్మశానవాటికలో దహన
సంస్కారాలు నిర్వహించారు. వివరాలు ఇలా ఉన్నాయి. విజయవాడ ఎన్టీపీసీలో పనిచేస్తున్న ఉప్పలగుప్తం మండలం గొల్లవిల్లికి చెందిన ఓ వ్యక్తి రెండు రోజుల క్రితం కుటుంబ సభ్యులతో కలిసి అమలాపురం వచ్చాడు. వారంతా ఆర్టీసీ కాంప్లెక్సు
సమీపంలోని ఒక లాడ్జిలో బస చేశారు. అతనికి వైరస్ తీవ్రత ఎక్కువై అస్వస్థతకు గురై ఇబ్బందిపడుతున్న తరుణంలో
శనివారం రాత్రి కుటుంబ సభ్యులు కిమ్స్ కు తరలించే సమయంలో మధ్యలోనే మరణించినట్టు ఆర్డీవో బీహెచ్ భవానీశంకర్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రొటోకాల్ నిబంధనల ప్రకారం మరణించిన వ్యక్తికి ట్రూనాట్ పరీక్ష చేయగా కొవిడ్-19
నిర్ధారణ అయిందని, దీంతో కుటుంబ సభ్యులకు కూడా ఆర్టీపీసీఆర్ పరీక్షలు నిర్వహించి వారిని కిమ్స్ కొవిడ్ ఆసుపత్రికి తరలించినట్టు ఆర్డీవో చెప్పారు. మృతునికి భార్య కుమార్తె ఉన్నారు. రెండు రోజుల పాటు లాడ్జిలో బస చేసిన వ్యక్తికి ఆహారం
సరఫరా చేసిన బంధువులను గుర్తించి వారి నుంచి కూడా శాంపిల్స్ తీసుకున్నారు. అటు రోగి బసచేసిన ఆర్టీసీ కాంపెక్లు
ఎదుట, మృతదేహాన్ని ఉంచిన ప్రభుత్వాసుపత్రి వద్ద వాణిజ్య సముదాయాలన్నీ మూసివేశారు. ఉన్నత కుటుంబానికి చెందిన
సదరు వ్యక్తి కరోనా లక్షణాలతో బాధపడుతున్నప్పటికీ పీఎంపీతో చికిత్స చేయించారు. దీంతో పరిస్థితి విషమించి మరణించిచాడని కుటుంబ సభ్యులు విలపిస్తున్నారు. ఈ మరణంతో కోనసీమవాసుల్లో ఆందోళన పెరిగిపోయింది.
Related News
-
SPECIAL STORY : సామాన్యుడి చేతికి టెక్నాలజీ అస్త్రం.. రోజువారీ జీవితంలో ‘ఏఐ’ విప్లవం!
-
TTD: తిరుమల శ్రీవారి నిత్య నైవేద్య వైభవం: ప్రసాద ప్రియుడైన ఏడుకొండలవాడు
-
VINTAGE VIBES : పాత రోజులు మళ్ళీ వచ్చేశాయ్!
-
Fulfilling Dreams: రుణం తీర్చుకున్న గురుభక్తి: పేద విద్యార్థినికి అభయమిచ్చిన ఆర్థోపెడిక్ వైద్యుడు
-
Fire Mishap on NH 44: అప్రమత్తతతో తప్పిన పెను ప్రమాదం.. 44వ జాతీయ రహదారిపై బస్సు దగ్ధం
-
TECH NEWS : వాట్సాప్లో 'బిల్ పేమెంట్స్'.. సౌలభ్యమా? ముప్పుతో కూడిన ప్రయోగమా?







