గంగవరం (రెడ్ బీ న్యూస్) 20 జనవరి 2022: మండలంలోని మర్రిపాలెం పరిధిలో ఉన్న జెర్రీ కొండ దొడ్డి కొండలను అటవీ శాఖకు అప్పగించ వద్దని జడ్పీటీసీ సభ్యురాలు బేబీ రత్నం, ఎంపీపీ కృష్ణారెడ్డి, వైస్ ఎంపీపీ గంగాదేవి తాహశీల్దార్ శ్రీమన్నారాయణను కోరారు. బుధవారం వీరి ఆధ్వర్యంలో మర్రిపాలెం గిరిజనులు తాహశీల్దార్ ను కలిసి వినతి పత్రం అందజేశారు. తాత ముత్తాతల కాలం నుంచి రెండు కొండలను గ్రామ అవసరాల కోసం కొండపోడు వ్యవసాయాలకు ఉపయోగించుకోవడం జరుగుతోంది అని, ఆ కొండలను అటవీ శాఖ అప్పగించ వద్దని వారు కోరారు. ఆ రెండు కొండలు అటవీశాఖ అప్పగించేందుకు రెవెన్యూ, అటవీశాఖ సిబ్బంది సర్వే చేపట్టడం సమంజసం కాదన్నారు.
Related News
-
SPECIAL STORY : సామాన్యుడి చేతికి టెక్నాలజీ అస్త్రం.. రోజువారీ జీవితంలో ‘ఏఐ’ విప్లవం!
-
TTD: తిరుమల శ్రీవారి నిత్య నైవేద్య వైభవం: ప్రసాద ప్రియుడైన ఏడుకొండలవాడు
-
VINTAGE VIBES : పాత రోజులు మళ్ళీ వచ్చేశాయ్!
-
Fulfilling Dreams: రుణం తీర్చుకున్న గురుభక్తి: పేద విద్యార్థినికి అభయమిచ్చిన ఆర్థోపెడిక్ వైద్యుడు
-
Fire Mishap on NH 44: అప్రమత్తతతో తప్పిన పెను ప్రమాదం.. 44వ జాతీయ రహదారిపై బస్సు దగ్ధం
-
TECH NEWS : వాట్సాప్లో 'బిల్ పేమెంట్స్'.. సౌలభ్యమా? ముప్పుతో కూడిన ప్రయోగమా?







