కాకినాడ (రెడ్ బీ న్యూస్) 1 నవంబర్ 2021: పలువురు తహసీల్దార్లకు పోస్టింగ్‌లు ఇస్తూ.. బదిలీలు చేస్తూ కలెక్టర్ హరికిరణ్ ఉత్తర్వులు జారీ చేశారు. కాకినాడ గ్రామీణ ఉప తహసీల్దారు మురార్జీని ఉద్యోగోన్నతిపై అక్కడే తహసీల్దారుగా నియమించారు. సెజ్ ఉప తహసీల్దారు ఎల్.ఝాన్సీలక్ష్మీని రౌతులపూడికి, జిల్లా పౌరసరఫరాల సంస్థ ఉప తహసీల్దారు పి.త్రినాథరావును అయినవిల్లి తహసీల్దారుగా నియమించారు. కె.గంగవరం తహసీల్దారుప్రసాద్‌ను తాళ్లరేవుకు, నిరీక్షణలో ఉన్న పి.చిన్నారావును కపిలేశ్వరపురానికి, అమరావతి నుంచి వచ్చిన వీవీ సత్యనారాయణను రావులపాలేనికి,తొండంగి ఉప తహసీల్దారు కె.కీర్తికి అక్కడే తహసీల్దారు బాధ్యతలు అప్పగించారు. మామిడికుదురు తహసీల్దారు ఎం.సుజాతను కడియానికి..అక్కడ తహసీల్దారు భీమారావును ఎటపాక ఆర్డీవో కార్యాలయానికి బదిలీ చేశారు.
Related News
-
SPECIAL STORY : సామాన్యుడి చేతికి టెక్నాలజీ అస్త్రం.. రోజువారీ జీవితంలో ‘ఏఐ’ విప్లవం!
-
TTD: తిరుమల శ్రీవారి నిత్య నైవేద్య వైభవం: ప్రసాద ప్రియుడైన ఏడుకొండలవాడు
-
VINTAGE VIBES : పాత రోజులు మళ్ళీ వచ్చేశాయ్!
-
Fulfilling Dreams: రుణం తీర్చుకున్న గురుభక్తి: పేద విద్యార్థినికి అభయమిచ్చిన ఆర్థోపెడిక్ వైద్యుడు
-
Fire Mishap on NH 44: అప్రమత్తతతో తప్పిన పెను ప్రమాదం.. 44వ జాతీయ రహదారిపై బస్సు దగ్ధం
-
TECH NEWS : వాట్సాప్లో 'బిల్ పేమెంట్స్'.. సౌలభ్యమా? ముప్పుతో కూడిన ప్రయోగమా?







