పెద్దాపురం: 31 అక్టోబరు 2020 (రెడ్ బీ న్యూస్): స్థానిక ఎంపీడీవో కార్యాలయంలో వాల్మీకి మహర్షి జయంతి వేడుకలను శనివారం ఘనంగా నిర్వహించారు. ముందుగా వాల్మీకి మహర్షి చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించి మాట్లాడారు. రామాయణ మహాకావ్యాన్ని రచించడం ద్వారా సీతారాముల సద్గుణాలను, గొప్పదనాన్ని చెప్పడంతో పాటు ఆదర్శవంతమైన జీవితం గడపడానికి, సమాజ శ్రేయస్సుకు అవసరమైన ఎన్నో జీవన సూత్రాలను మనకు తెలియచేసిన వాల్మీకి మహర్షికి మనందరం రుణపడి ఉన్నామన్నారు. ఆ మహాశయుని జయంతి సందర్భంగా ఆయనను స్మరించుకోవడం మనం అదృష్టంగా భావించాలన్నారు. ఈ కార్యక్రమంలో ఈవోపీఆర్డీ కరక హిమమహేశ్వరి, కార్యాలయ ఏవో వీరేశ్వరపు శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
Related News
-
SPECIAL STORY : సామాన్యుడి చేతికి టెక్నాలజీ అస్త్రం.. రోజువారీ జీవితంలో ‘ఏఐ’ విప్లవం!
-
TTD: తిరుమల శ్రీవారి నిత్య నైవేద్య వైభవం: ప్రసాద ప్రియుడైన ఏడుకొండలవాడు
-
VINTAGE VIBES : పాత రోజులు మళ్ళీ వచ్చేశాయ్!
-
Fulfilling Dreams: రుణం తీర్చుకున్న గురుభక్తి: పేద విద్యార్థినికి అభయమిచ్చిన ఆర్థోపెడిక్ వైద్యుడు
-
Fire Mishap on NH 44: అప్రమత్తతతో తప్పిన పెను ప్రమాదం.. 44వ జాతీయ రహదారిపై బస్సు దగ్ధం
-
TECH NEWS : వాట్సాప్లో 'బిల్ పేమెంట్స్'.. సౌలభ్యమా? ముప్పుతో కూడిన ప్రయోగమా?







