గంగవరం (రెడ్ బీ న్యూస్) 14 నవంబర్ 2021: విజ్ఞాన భాండాగారాలు గ్రంధాలయాలయాలని, విజ్ఞానాన్ని పెంపొందించుకునేందుకు ఏర్పాటుచేసిన గ్రంధాలయాలు దేవాలయాల కన్నా గొప్పవాని విశ్రాంత ప్రధానోపాధ్యాయుడు ఎంఎన్ పట్నాయక్, ఇంపాక్ట్ మోటివేషన్ ట్రైనర్ కె.రాంబాబు అన్నారు. స్థానిక శాఖా గ్రంథాలయంలో నిర్వహించిన గ్రంథాలయ వారోత్సవాల్లో ఆదివారం పాల్గొని వారోత్సవాలు ప్రారంభించారు. అనంతరం వారు మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ పుస్తక పఠనం అలవర్చు కోవాలన్నారు. విద్యార్థులకు, నిరుద్యోగ యువతకు వివిధ పోటీ పరీక్షలకు సంబంధించి పుస్తకాలు, పురాణ, ఇతిహాసాలు, నవల్స్, దినపత్రికలు అందుబాటులో ఉన్నాయని, అవి ఎంతో ఉపయోగకరమన్నారు. అన్నివర్గాలవారికి ఉపయోగపడే అన్నిరకాల పుస్తకాలు గ్రంధాలయంలో లభిస్తాయన్నారు. ఉన్నాయన్నారు. ఈనెల 18వ తేదీన పాఠశాలలు, కళాశాల విద్యార్థులకు వ్యాసరచన, డిబేట్, చిత్రలేఖనం పోటీలు నిర్వహిస్తున్నట్టు ఆయన చెప్పారు. బాలల దినోత్సవాన్ని పురస్కరించుకుని పాఠశాల విద్యార్థులతో కలిసి చాచా నెహ్రూ చిత్రపటానికి పూలమాలలువేసి ఘనంగా నివాళులర్పించారు. సందర్భంగా సీనియర్ రెగ్యులర్ రీడర్ అయిన నరసింహమూర్తి పట్నాయక్ ను ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో గ్రంథాలయ అధికారిణి జే. సత్యవతి సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
Related News
-
SPECIAL STORY : సామాన్యుడి చేతికి టెక్నాలజీ అస్త్రం.. రోజువారీ జీవితంలో ‘ఏఐ’ విప్లవం!
-
TTD: తిరుమల శ్రీవారి నిత్య నైవేద్య వైభవం: ప్రసాద ప్రియుడైన ఏడుకొండలవాడు
-
VINTAGE VIBES : పాత రోజులు మళ్ళీ వచ్చేశాయ్!
-
Fulfilling Dreams: రుణం తీర్చుకున్న గురుభక్తి: పేద విద్యార్థినికి అభయమిచ్చిన ఆర్థోపెడిక్ వైద్యుడు
-
Fire Mishap on NH 44: అప్రమత్తతతో తప్పిన పెను ప్రమాదం.. 44వ జాతీయ రహదారిపై బస్సు దగ్ధం
-
TECH NEWS : వాట్సాప్లో 'బిల్ పేమెంట్స్'.. సౌలభ్యమా? ముప్పుతో కూడిన ప్రయోగమా?







