మహారాణి ఆశయ సాధనకు ప్రతీ ఒక్కరూ కృషి చేయాలి

Betting appమహారాణి ఆశయ సాధనకు కృషి చేయాలి పెద్దాపురం ( రెడ్ బీ న్యూస్) 22 నవంబరు 2021: మహారాణి ఆశయ సాధనకు ప్రతీ ఒక్కరూ కృషి చేయాలని మహారాణి సత్రం ఈవో కాట్నం జగన్మోహన శ్రీనివాస్ కోరారు. స్థానిక రాజా వత్సవాయి బుచ్చి సీతాయమ్మ జగపతి బహుద్దూర్ మహారాణి 186వ వర్ధంతిని ఈవో ఆధ్వ ర్యంలో సోమవారం నిర్వహించారు. ముందుగా మహారాణీ విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. ఈవో మాట్లాడుతూ బాటసారులు, అన్నారులు, నిరుపేదల ఆకలిబాధను తీర్చేందుకు 18వ శతాబ్దంలో సత్రాన్ని ఏర్పాటు చేయడం నిజంగా చాలా గర్వకారణమన్నారు. నాటి నుంచీ నేటివరకూ నిరాటంకంగా ఇక్కడ నిత్యం అన్నదాన కార్యక్రమం జరగడం గొప్ప విషయమన్నారు. అనంతరం నిరుపేదలకు వస్త్రదానం చేశారు. ఈకార్యక్రమంలో సత్రం సిబ్బంది బులుసు రవి తదితరులు పాల్గొన్నారు.
ads
×
 • Home
 • About Us
 • Politics
 • Crime
 • Devotional
 • Education
 • Entertainment
 • General
 • Business
 • Information
 • Gallery
 • Contact Us