గంగవరం (రెడ్ బీ న్యూస్) 5 నవంబర్ 2021:
యువత విద్యతో పాటు క్రీడల్లో రాణించాలని ఎంపీపీ పల్లాల కృష్ణారెడ్డి అన్నారు. స్థానిక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఆవరణలో ఎంపీడీవో జాన్ మిల్టన్ ఎంఈవో మల్లేశ్వరరావు ఆధ్వర్యంలో నిర్వహించిన ఏపీ సీఎం కప్ క్రీడా పోటీలను శుక్రవారం ప్రారంభించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ క్రీడాకారులు మండల స్థాయిలో గెలుపొంది డివిజన్ జిల్లా స్థాయి పోటీలకు ఎంపిక అవ్వాలన్నారు. క్రీడల్లో రాణించే విద్యార్థులను ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు ప్రోత్సహించాలన్నారు. కబడ్డీ, వాలీబాల్ పోటీలను ఎంపీపీ ప్రారంభించారు. బాలికల వాలీబాల్ పోటీలను సర్పంచ్ కలుముల అక్కమ్మ ప్రారంభించగా, ఎంపీటీసీ కబడ్డీ పోటీలను ప్రారంభించారు. 100 మీటర్ల పరుగు పందెం ఎంపీడీవో జాన్ మిల్టన్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో వైస్ ఎంపీపీ కె. రామతులసి, నెల్లిపూడి ఎంపీటీసీ కనకలక్ష్మి, డిప్యూటీ తహశీల్దార్ పి. రామకృష్ణ, రెవిన్యూ ఇనస్పెక్టర్ జిలాని, ఉపాధిహామీ ఏపివో సురేష్ కుమార్, ప్రధానోపాధ్యాయులు ఆర్.వి.వి సత్యనారాయణ, ఎం. అప్పారావు తదితరులు పాల్గొన్నారు.
Related News
-
SPECIAL STORY : సామాన్యుడి చేతికి టెక్నాలజీ అస్త్రం.. రోజువారీ జీవితంలో ‘ఏఐ’ విప్లవం!
-
TTD: తిరుమల శ్రీవారి నిత్య నైవేద్య వైభవం: ప్రసాద ప్రియుడైన ఏడుకొండలవాడు
-
VINTAGE VIBES : పాత రోజులు మళ్ళీ వచ్చేశాయ్!
-
Fulfilling Dreams: రుణం తీర్చుకున్న గురుభక్తి: పేద విద్యార్థినికి అభయమిచ్చిన ఆర్థోపెడిక్ వైద్యుడు
-
Fire Mishap on NH 44: అప్రమత్తతతో తప్పిన పెను ప్రమాదం.. 44వ జాతీయ రహదారిపై బస్సు దగ్ధం
-
TECH NEWS : వాట్సాప్లో 'బిల్ పేమెంట్స్'.. సౌలభ్యమా? ముప్పుతో కూడిన ప్రయోగమా?







