రంగంపేట: 11 జూన్ 2020 (రెడ్ బీ న్యూస్):మండలంలోని జి.దొంతమూరులో ఉన్న రుచి సోయా కంపెనీకి చెందిన పామాయిల్ గెలల సేకరణ
కేంద్రంలో ఉద్యోగి గెలల తూకంలో చేతివాటం ప్రదర్శించడంతో రైతులు ఆశయాన్ని బట్టబయలు చేశారు. దొంతమూరు పామాయిల్ గెలల సేకరణ కేంద్రంలో రైతులు తెచ్చిన గెలలను తూచిన తరువాత అక్కడ ఉద్యోగిగా పనిచేస్తున్న సతీష్ అనే వ్యక్తి రైతులకు తూకం స్లిప్పు అందిస్తాడు. టన్ను గెలలు వస్తే 100 కిలోలు తగ్గించి స్లిప్పు కంప్యూటర్లో నమోదు చేసి అందిస్తున్నాడు. ఇటీవల రైతులకు అనుమానం రావడంతో రాష్ట్ర
పామాయిల్ రైతుల సంఘం మాజీ అధ్యక్షుడు సత్తి రామారెడ్డి, జిల్లా పామాయిల్ రైతుల సంఘం అధ్యక్షుడు పెండ్యాల బుజ్జిబాబు కలిసి తూకం తేడాలను గుర్తించారు. దీంతో రుచి సోయా కంపెనీకి చెందిన ప్రతినిధులు మల్లేశం, పట్టాభిరామ రెడ్డి, రవీంద్ర దొంతమూరు పామాయిల్ జలాల సేకరణ కేంద్రానికి వచ్చి రైతులతో చర్చించారు. ఉద్యోగి ఇలా మిగిల్చుకున్న గెలలను తాను లీజుకు తీసుకున్న పొలం
తాలూకు ఖాతాలోకి వేసుకుంటున్నట్లు వారు తెలిపారు. కేంద్రం కాంట్రాక్టును రద్దు చేసి కంపెనీ ఉద్యోగిని ఇక్కడ నియమిస్తామని మల్లేశం రైతులకు హామీ ఇచ్చారు. ఈ కేంద్రాన్ని రద్దు చేసి రైతుల గెలలను అటు రంగంపేట లేదా సింగంపల్లి కేంద్రానికి తీసుకువెళ్లే ఏర్పాటు చేయాలని సూచించారు.
Related News
-
SPECIAL STORY : సామాన్యుడి చేతికి టెక్నాలజీ అస్త్రం.. రోజువారీ జీవితంలో ‘ఏఐ’ విప్లవం!
-
TTD: తిరుమల శ్రీవారి నిత్య నైవేద్య వైభవం: ప్రసాద ప్రియుడైన ఏడుకొండలవాడు
-
VINTAGE VIBES : పాత రోజులు మళ్ళీ వచ్చేశాయ్!
-
Fulfilling Dreams: రుణం తీర్చుకున్న గురుభక్తి: పేద విద్యార్థినికి అభయమిచ్చిన ఆర్థోపెడిక్ వైద్యుడు
-
Fire Mishap on NH 44: అప్రమత్తతతో తప్పిన పెను ప్రమాదం.. 44వ జాతీయ రహదారిపై బస్సు దగ్ధం
-
TECH NEWS : వాట్సాప్లో 'బిల్ పేమెంట్స్'.. సౌలభ్యమా? ముప్పుతో కూడిన ప్రయోగమా?







