గంగవరం (రెడ్ బీ న్యూస్) 7 డిసెంబర్ 2021: తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు మండలంలోని జగ్గంపాలెం, జియ్యంపాలెం గ్రామాల్లో టీడీపీ మండల కమిటీ అధ్యక్షుడు పాము అర్జున ఆధ్వర్యంలో గౌరవ సభ కార్యక్రమం మంగళవారం నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను ప్రజలకు వివరించారు. ఓటిఎస్ విధానాన్ని రద్దు చేయాలని, పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గించాలని, అర్హులందరికీ సంక్షేమ పథకాలు అమలు చేయాలని డిమాండ్ చేస్తూ నిరసన వ్యక్తం చేశారు. అలాగే వైసీపీ నాయకులు అరాచకాలను ప్రజలకు వివరించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ డాక్టర్ తీగల ప్రభ, రాష్ట్ర రైతు అధికార ప్రతినిధి కనిగిరి రాంబాబు, టీడీపీ నాయకులు భాను ప్రకాష్, వీరబాబు, బద్రి, రామకృష్ణ, నరసన్న దొర తదితరులు పాల్గొన్నారు.
Related News
-
SPECIAL STORY : సామాన్యుడి చేతికి టెక్నాలజీ అస్త్రం.. రోజువారీ జీవితంలో ‘ఏఐ’ విప్లవం!
-
TTD: తిరుమల శ్రీవారి నిత్య నైవేద్య వైభవం: ప్రసాద ప్రియుడైన ఏడుకొండలవాడు
-
VINTAGE VIBES : పాత రోజులు మళ్ళీ వచ్చేశాయ్!
-
Fulfilling Dreams: రుణం తీర్చుకున్న గురుభక్తి: పేద విద్యార్థినికి అభయమిచ్చిన ఆర్థోపెడిక్ వైద్యుడు
-
Fire Mishap on NH 44: అప్రమత్తతతో తప్పిన పెను ప్రమాదం.. 44వ జాతీయ రహదారిపై బస్సు దగ్ధం
-
TECH NEWS : వాట్సాప్లో 'బిల్ పేమెంట్స్'.. సౌలభ్యమా? ముప్పుతో కూడిన ప్రయోగమా?







