అమరావతి (రెడ్ బీ న్యూస్) 13 డిసెంబర్ 2021: వేతన సవరణ (పీఆర్‌సీ) సహా తమ డిమాండ్లు అన్నింటిపైనా ప్రభుత్వం నుంచి నిర్దిష్టమైన హామీ వచ్చేంత వరకు ఉద్యమ కార్యాచరణ నుంచి వెనక్కి వెళ్లేది లేదని ఉద్యోగ సంఘాల నేతలు స్పష్టం చేశారు. పీఆర్‌సీపై కమిటీ నివేదికను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ముఖ్యమంత్రికి అందజేయడాన్ని స్వాగతిస్తున్నామని.. అయితే నివేదికలో పొందుపరిచిన ప్రతిపాదనలపై అసంతృప్తి వ్యక్తం చేశారు. సీఎం ఆధ్వర్యంలో నిర్వహించే చర్చల ద్వారానే తమకు న్యాయం జరుగుతుందనే ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. అధికారుల కమిటీ ఇచ్చిన నివేదికపై సమగ్ర పరిశీలన కోసం తొమ్మిది మంది సభ్యులతో ఉద్యమ కమిటీని తాము ఏర్పాటు చేశామని.. ఇందులోని సభ్యులు ప్రభుత్వానికి ఇచ్చిన ప్రతిపాదనలపై లోతుగా పరిశీలన చేస్తారని తెలిపారు. పీఆర్‌సీ అంటే ఫిట్‌మెంట్ కాదని.. ఇప్పటికే 27 శాతం ఐఆర్ తీసుకుంటున్నామని గుర్తు చేశారు. కేంద్ర ప్రభుత్వ పే స్కేలుకు, రాష్ట్ర ఇచ్చే పే స్కేలుకు ఎలాంటి సంబంధం ఉండకూదన్నారు. సీఎం లేదా ప్రభుత్వం నియమించిన అధికారుల కమిటీ వద్ద తమ డిమాండ్లు వినిపిస్తామన్నారు. 71 డిమాండ్లతో తాము ఉద్యమం ప్రారంభించామని.. వాటి నుంచి వెనక్కి తగ్గబోమని నేతలు తేల్చి చెప్పారు
Related News
-
SPECIAL STORY : సామాన్యుడి చేతికి టెక్నాలజీ అస్త్రం.. రోజువారీ జీవితంలో ‘ఏఐ’ విప్లవం!
-
TTD: తిరుమల శ్రీవారి నిత్య నైవేద్య వైభవం: ప్రసాద ప్రియుడైన ఏడుకొండలవాడు
-
VINTAGE VIBES : పాత రోజులు మళ్ళీ వచ్చేశాయ్!
-
Fulfilling Dreams: రుణం తీర్చుకున్న గురుభక్తి: పేద విద్యార్థినికి అభయమిచ్చిన ఆర్థోపెడిక్ వైద్యుడు
-
Fire Mishap on NH 44: అప్రమత్తతతో తప్పిన పెను ప్రమాదం.. 44వ జాతీయ రహదారిపై బస్సు దగ్ధం
-
TECH NEWS : వాట్సాప్లో 'బిల్ పేమెంట్స్'.. సౌలభ్యమా? ముప్పుతో కూడిన ప్రయోగమా?







