కాకినాడ (రెడ్ బీ న్యూస్) 22 డిసెంబర్ 2021: మధ్యవర్తులు, దళారుల ప్రమేయం లేకుండా రైతు భరోసా కేంద్రాల ద్వారా ధాన్యం కొనుగోళ్లు చేపట్టాలని సంయుక్త కలెక్టర్(రెవెన్యూ, రైతు భరోసా) సుమిత్ కుమార్ అధికారులను ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్ నుంచి ఆయన జేసీలు కీర్తి, భార్గవ్‌తేజతో కలిసి వర్చువల్ విధానంలో సబ్ కలెక్టర్లు, ఐటీడీఏ పీవోలు, ఆర్డీవోలు, మున్సిపల్ కమిషనర్లు, ఎంపీడీవోలు, తహసీల్దార్లతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అన్ని ప్రమాణాలూ సక్రమంగా ఉన్న ధాన్యంతో పాటు, రంగుమారినవి సేకరించాలని ఆదేశించారు. సాంకేతిక సమస్యలు తలెత్తితే వెంటనే సంబంధిత అధికారికి తెలియజేయాలన్నారు. రానున్న 20 రోజులు కీలకమని, పెద్ద ఎత్తున ధాన్యం సేకరణ చేపట్టాలని, రైతులకు కనీస మద్ధతు ధర కల్పించడమే లక్ష్యంగా పనిచేయాలన్నారు. ఫీవర్ సర్వే, సచివాలయాలు, స్పందన అర్జీలు, బయోమెట్రిక్ హాజరు, ఘన వ్యర్థాల నిర్వహణ తదితర అంశాలపై జేసీ కీర్తి సమీక్షించారు. జగనన్న తోడు, నవరత్నాలు-పేదలందరికీ ఇళ్లు, లేఔట్ల అభివృద్ధి, ఓటీఎస్‌పై జేసీ భార్గవ్‌తేజ సమీక్షించారు. ఈ సమావేశంలో డీఆర్వో సత్తిబాబు, సీపీవో త్రినాథ్, ఎల్‌డీఎం శ్రీనివాసరావు, డీఎస్‌వో ప్రసాదరావు, వ్యవసాయశాఖ డీడీ మాధవరావు తదితరులు పాల్గొన్నారు.
Related News
-
SPECIAL STORY : సామాన్యుడి చేతికి టెక్నాలజీ అస్త్రం.. రోజువారీ జీవితంలో ‘ఏఐ’ విప్లవం!
-
TTD: తిరుమల శ్రీవారి నిత్య నైవేద్య వైభవం: ప్రసాద ప్రియుడైన ఏడుకొండలవాడు
-
VINTAGE VIBES : పాత రోజులు మళ్ళీ వచ్చేశాయ్!
-
Fulfilling Dreams: రుణం తీర్చుకున్న గురుభక్తి: పేద విద్యార్థినికి అభయమిచ్చిన ఆర్థోపెడిక్ వైద్యుడు
-
Fire Mishap on NH 44: అప్రమత్తతతో తప్పిన పెను ప్రమాదం.. 44వ జాతీయ రహదారిపై బస్సు దగ్ధం
-
TECH NEWS : వాట్సాప్‌లో 'బిల్ పేమెంట్స్'.. సౌలభ్యమా? ముప్పుతో కూడిన ప్రయోగమా?







