సామర్లకోట,17 సెప్టెంబరు 2020 (రెడ్ బి న్యూస్):
సామర్లకోట పట్టణంలోని మున్సిపల్ ఉన్నత పాఠశాలలో చదువుకునే విద్యార్థులకు రేషన్ పంపిణీ కార్యక్రమాన్ని గురువారం నిర్వహించారు. అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో అమలు చేస్తున్న మధ్యాహ్న భోజన పథకానికి సంబంధించి కరోనా లాక్ డౌన్ కారణంగా పాఠశాలలు మూతబడిన నేపథ్యంలో వారి భోజనానికి సంబంధించి నేరుగా వారి గృహానికే రేషన్ అందే విధంగా ఈ పంపిణీ చేపడుతున్నట్టు బచ్చు ఫౌండేషన్ మున్సిపల్ ఉన్నత పాఠశాల హెచ్ఎం తోటకూర సాయి రామకృష్ణ చెప్పారు. ఈ పాఠశాలలతో పాటు ఉన్నత పాఠశాల తోట గోపాలకృష్ణ హైస్కూల్, మున్సిపల్ ఉన్నత పాఠశాల తో పాటు భాస్కర రామారావు ఉన్నత పాఠశాల జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాల, గవర్నమెంట్ ఉన్నత పాఠశాల, సిపిఎం ఎయిడెడ్ ఉన్నత పాఠశాలలో ఈ రేషన్ అందజేత కార్యక్రమాలను ఆధ్వర్యంలో చేపట్టారు. ఆరో తరగతి నుంచి పదవ తరగతి వరకు చదువుకున్న విద్యార్థులకు మొదటి 15 రోజులకు సంబంధించి బియ్యం, కోడిగుడ్లు, చిక్కీలు అందిస్తున్నట్లు హెచ్ఎం తెలిపారు. ఈ కార్యక్రమంలో పాఠశాల విద్యా కమిటీ చైర్మన్ జానకిరామయ్య వైసీపీ నాయకులు చిట్టిమాని శ్రీనివాసరావు, పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
Related News
-
SPECIAL STORY : సామాన్యుడి చేతికి టెక్నాలజీ అస్త్రం.. రోజువారీ జీవితంలో ‘ఏఐ’ విప్లవం!
-
TTD: తిరుమల శ్రీవారి నిత్య నైవేద్య వైభవం: ప్రసాద ప్రియుడైన ఏడుకొండలవాడు
-
VINTAGE VIBES : పాత రోజులు మళ్ళీ వచ్చేశాయ్!
-
Fulfilling Dreams: రుణం తీర్చుకున్న గురుభక్తి: పేద విద్యార్థినికి అభయమిచ్చిన ఆర్థోపెడిక్ వైద్యుడు
-
Fire Mishap on NH 44: అప్రమత్తతతో తప్పిన పెను ప్రమాదం.. 44వ జాతీయ రహదారిపై బస్సు దగ్ధం
-
TECH NEWS : వాట్సాప్లో 'బిల్ పేమెంట్స్'.. సౌలభ్యమా? ముప్పుతో కూడిన ప్రయోగమా?







