గంగవరం (రెడ్ బీ న్యూస్) 31 అక్టోబర్ 2021: మండలంలోని ఆమదాలబందకు చెందిన చుండం వెంకటేశ్వర్లు వ్యవసాయ కూలీగా పని చేసుకుంటూ కొద్ది రోజుల క్రితం పాముకాటుకు గురై మృతి చెందాడు. అడ్డతీగల గురుకుల పాఠశాలలో 1998 పదవ తరగతి పూర్వ విద్యార్థులు తమ తోటి స్నేహితుడు మృతిచెందాడని తెలుసుకుని అతని కుటుంబ సభ్యులను ఆదివారం పరామర్శించారు. స్నేహితుని కుటుంబానికి రూ.12 వేల నగదు సాయం అందజేశారు. ఈ కార్యక్రమంలో సీతారపు నానాజీ, రాజబాబు, ప్రసన్నకుమార్, సత్యనారాయణ, వెంకట్రావు, గవాస్కర్, సింహాద్రి, సుబ్బారావు, శ్రీనుబాబు, కన్నయ్య, శ్రీనివాస్, సత్యనారాయణ, లక్ష్మీనారాయణ, కామేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.
Related News
-
SPECIAL STORY : సామాన్యుడి చేతికి టెక్నాలజీ అస్త్రం.. రోజువారీ జీవితంలో ‘ఏఐ’ విప్లవం!
-
TTD: తిరుమల శ్రీవారి నిత్య నైవేద్య వైభవం: ప్రసాద ప్రియుడైన ఏడుకొండలవాడు
-
VINTAGE VIBES : పాత రోజులు మళ్ళీ వచ్చేశాయ్!
-
Fulfilling Dreams: రుణం తీర్చుకున్న గురుభక్తి: పేద విద్యార్థినికి అభయమిచ్చిన ఆర్థోపెడిక్ వైద్యుడు
-
Fire Mishap on NH 44: అప్రమత్తతతో తప్పిన పెను ప్రమాదం.. 44వ జాతీయ రహదారిపై బస్సు దగ్ధం
-
TECH NEWS : వాట్సాప్లో 'బిల్ పేమెంట్స్'.. సౌలభ్యమా? ముప్పుతో కూడిన ప్రయోగమా?







