రెడ్ బీ న్యూస్,7 జనవరి 2022 : ప్రపంచంలోనే అత్యంత విలువైన సంస్థగా ఘనత దక్కించుకొన్న యాపిల్ కంపెనీ సీఈవో టిమ్‌కుక్ 2021లో భారీ వేతనం అందుకొన్నారు. గత రెండేళ్లతో పోలిస్తే జీతం రూపంలో అందుకొన్న మొత్తంలో ఏమీ తేడా రాలేదు. ఈ సారి కూడా 3 మిలియన్ డాలర్ల వార్షిక వేతనం తీసుకున్నారు. దీంతో పాటు 82 మిలియన్ డాలర్లు విలువైన వాటాలు కూడా ఆయనకు లభించాయి. మరో 12 మిలియన్ డాలర్ల విలువైన పరిహారాన్ని నాన్ ఈక్విటీ ఇన్సెంటీవ్‌గా అందించారు. ఇతరాల రూపంలో 1.39 మిలియన్ డాలర్లు కుక్‌కు లభించాయి. ఆయనకు ఇతరాల రూపంలో లభించిన 1.39 మిలియన్ డాలర్లలో 7,12,488 డాలర్లను ప్రైవేట్ జెట్ ప్రయాణాలకు వినియోగించగా.. 6,30,630 డాలర్లను భద్రత కోసం ఖర్చు చేశారు. ఈ లెక్కలు మొత్తం చూసుకొంటే కుక్ 2021లో 98 మిలియన్ డాలర్లను కుక్ అందుకొన్నట్లైంది. టిమ్‌కుక్ అవసరాలు, భదత్ర రిత్యా యాపిల్ సంస్థ ఆయనకు ఒక ప్రైవేటు జెట్‌ను సమకూర్చింది. నాటి నుంచి ఆయన వాణిజ్య విమానాల్లో ప్రయాణించలేదు. యాపిల్ సీఈవో బాధ్యతలు చేపట్టి 2021 నాటికి 10 ఏళ్లు పూర్తయింది. ఆయన సీఈవోగా ప్రమోట్ అయిన నాటి నుంచి తొలిసారి వాటాను కేటాయించినట్లు యాపిల్ రెగ్యూలేటరీ ఫైలింగ్‌లో పేర్కొంది.
Related News
-
SPECIAL STORY : సామాన్యుడి చేతికి టెక్నాలజీ అస్త్రం.. రోజువారీ జీవితంలో ‘ఏఐ’ విప్లవం!
-
TTD: తిరుమల శ్రీవారి నిత్య నైవేద్య వైభవం: ప్రసాద ప్రియుడైన ఏడుకొండలవాడు
-
VINTAGE VIBES : పాత రోజులు మళ్ళీ వచ్చేశాయ్!
-
Fulfilling Dreams: రుణం తీర్చుకున్న గురుభక్తి: పేద విద్యార్థినికి అభయమిచ్చిన ఆర్థోపెడిక్ వైద్యుడు
-
Fire Mishap on NH 44: అప్రమత్తతతో తప్పిన పెను ప్రమాదం.. 44వ జాతీయ రహదారిపై బస్సు దగ్ధం
-
TECH NEWS : వాట్సాప్‌లో 'బిల్ పేమెంట్స్'.. సౌలభ్యమా? ముప్పుతో కూడిన ప్రయోగమా?







