RDO PEDAPURAM: స్వచ్ఛంద సంస్థల సహకారాన్ని సద్వినియోగం చేసుకోవాలి

UPDATED 28th SEPTEMBER 2022 WEDNESDAY 7:00 PM

RDO PEDDAPURAM : హిజ్రాలు సమాజంలో సత్ప్రవర్తన కలిగి ఉంటూ ప్రభుత్వం, స్వచ్ఛంద సంస్థలు అందిస్తున్న సహకారాన్ని సద్వినియోగం చేసుకోవాలని పెద్దాపురం ఆర్డీవో జె. సీతారామారావు (J.Seetharamarao) అన్నారు. మండలంలోని పులిమేరు శివారులో గల శాంతివర్ధన విభిన్న ప్రతిభావంతుల పాఠశాలలో బుధవారం సాయంత్రం శాంతివర్ధన మినిస్ట్రీస్ (Shanthivardhana Ministeries) ఆధ్వర్యంలో డివిజన్ పరిధిలోని 62 మంది హిజ్రాలకు ఒక్కొక్కరికి సుమారు రూ. 3500 విలువచేసే 25 కేజీల బియ్యం బస్తా, పౌష్టికాహార కిట్లు, పసుపు, గాజులు, చీర రవికలను ఆర్డీవో చేతులమీదుగా పంపిణీ చేశారు. ఈ సందర్భంలో పాఠశాల వ్యవస్థాపకుడు రాయవరపు వీరబాబు అధ్యక్షతన జరిగిన సదస్సులో ఆర్డీవో సీతారామారావు మాట్లాడుతూ చెన్నైలో పోలీస్ ఆఫీసరుగా ఎన్నికైన హిజ్రాను ఆదర్శంగా తీసుకొని అన్ని రంగాల్లో హిజ్రాలు రాణించాలన్నారు.

సమాజంలో ప్రస్తుతం మహిళలు, హిజ్రాలకు ఇబ్బందులు దృష్ట్యా ప్రభుత్వం ప్రవేశపెట్టిన దిశా యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవాలన్నారు.  మీరు ఇబ్బందుల్లో ఉన్నప్పుడు ఒక్క బటన్ నొక్కితే పోలీసులు సత్వరమే మీ వద్దకు వచ్చి  మీ సమస్యలను పరిష్కరించే దిశగా యాప్ పనిచేస్తుందని అన్నారు.  స్వచ్ఛంద సంస్థలు అందిస్తున్న అవగాహన సదస్సులు, సేవా కార్యక్రమాలను సద్వినియోగం చేసుకొని ప్రవర్తనలో మంచి పేరు తెచ్చుకోవాల్సిన బాధ్యత మీపై ఉందన్నారు. హిజ్రాలకు శాంతివర్ధన స్వచ్ఛంద సంస్థ అందిస్తున్న సేవలు అభినందనీయమని ఆర్డీవో అన్నారు. అనంతరం శాంతివర్ధన పాఠశాల విద్యార్థులకు కళ్ళజోళ్లను అందజేసి పిల్లలకు అందిస్తున్న సేవలపై ఆరా తీసి సంస్థ అందిస్తున్న సేవలను కొనియాడారు.

ఈ కార్యక్రమంలో విభిన్న ప్రతిభావంతుల జిల్లా కార్యాలయం సూపరెంటెండెంట్ బి.వి.వి.యస్. నాగభూషణం, హోం సూపరిండెంట్ జి.ఆర్.వి.పి మూర్తి రాజు, యు. రాజు, పాఠశాల ప్రిన్సిపాల్ రాయవరపు సత్యవేణి, ఏవో వేణుగోపాల్, శాంతివర్ధన్, చైతన్య, పాఠశాల సిబ్బంది పాల్గొన్నారు.

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us