IJU : ఐజేయూ జాతీయ సభ్యుడిగా సీనియర్ జర్నలిస్ట్ రాంబాబు ఎన్నిక

UPDATED 24th SEPTEMBER 2022 SATURDAY 06:00 AM

Indian Journalist Union : ఇండియన్ జర్నలిస్ట్ యూనియన్ (IJU) జాతీయ సభ్యుడిగా పెద్దాపురం (Peddapuram) నియోజకవర్గ సీనియర్ జర్నలిస్ట్, పెద్దాపురం సాక్షి (Sakshi) రిపోర్టర్ రాకుర్తి రాంబాబు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఇండియన్ జర్నలిస్ట్స్ అసోసియేషన్ (IJU) జాతీయ కౌన్సిల్ సభ్యుల ఎన్నికల ప్రక్రియ దేశవ్యాప్తంగా ముగిసింది. ఆంధ్రప్రదేశ్ లో 52 మంది వరకు జాతీయ కౌన్సిల్ సభ్యులుగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా నుంచి నలుగురు జాతీయ కౌన్సిల్ కు ఏకగ్రీవంగా ఎన్నిక కావడం జరిగింది. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ఎం. శ్రీరామమూర్తి (తూ.గో.రాజమండ్రి) తిరిగి జాతీయ కౌన్సిల్ సభ్యుడిగా ఎన్నిక కాగా, APUWJ ఉమ్మడి తూర్పుగోదావరి అధ్యక్షులు కె. స్వాతిప్రసాద్ ( కాకినాడ), APUWJ రాష్ట్ర నాయకులు రాకుర్తి రాంబాబు (కాకినాడ జిల్లా, పెద్దాపురం), సయ్యద్ హుస్సేన్ (డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా, మండపేట) ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.

పెద్దాపురం నుంచి ఎన్నిక అయిన సీనియర్ జర్నలిస్ట్ రాంబాబు రెండు దశాబ్దాల నుంచి జర్నలిస్ట్ వృత్తిలో కొనసాగుతున్నారు. జనస్పందన, ఆంధ్రజ్యోతి, వార్త, సూర్య, ఆంధ్రప్రభ మొదలయిన ప్రముఖ పత్రికల్లో పని చేసిన ఆయన ప్రస్తుతం పెద్దాపురం సాక్షి రిపోర్టర్ గా కొనసాగుతున్నారు. 20 ఏళ్ల జర్నలిజం వృత్తిలో ఎన్నో పదవుల్లో పనిచేశారు. పెద్దాపురం ప్రెస్ క్లబ్ అధ్యక్షుడుగా, నియోజకవర్గ, డివిజన్ ప్రెస్ క్లబ్ అధ్యక్షుడుగా, APUWJ రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడిగా పనిచేసి జర్నలిస్టుల ఐక్యత కోసం పోరాడారు. పంతం గాంధీ మోహన్ ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో 20 మంది పాత్రికేయులకు ఇళ్ల పట్టాలు ఇప్పించడంలో ఆయన ఎంతో కృషి చేశారు. ఎన్ని ఒడిదుడుకులు ఉన్నా రెండు దశాబ్దాలుగా జర్నలిజం వృత్తిలో కొనసాగుతూ ఎంతోమంది యువకులను జర్నలిజంలో నడిపిస్తూ అందరి మన్ననలు పొందుతున్నారు.

ఐజేయు (IJU) సభ్యుడిగా ఎన్నికయిన రాంబాబును ఏపీ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ దవులూరి దొరబాబు (Davuloori Dorababu), ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప (Nimmakayala Chinarajappa), మాజీ ఎమ్మెల్యే పంతం గాంధీమోహన్, జనసేన, బీజేపీ, కాంగ్రెస్ పార్టీల నియోజవర్గ ఇంచార్జిలు తుమ్మల రామస్వామి, తుమ్మల పద్మజ, తుమ్మల దొరబాబు, మున్సిపల్ చైర్ పర్సన్ బొడ్డు తులసి మంగతాయారు, మున్సిపల్ వైస్ చైర్మన్లు నెక్కంటి సాయిప్రసాద్, కనకాల మహాలక్ష్మి, మున్సిపల్ మాజీ చైర్మన్లు రాజా సూరిబాబురాజు, ముప్పన శ్యామలాంబ, జడ్పీటీసీ గవరసాన సూరిబాబు, ఎంపీపీ పెంకే సత్యవతి, ఆప్కో మాజీ డైరెక్టర్ ముప్పన వీర్రాజు, సిఐటియు నాయకులు సిరిపురపు శ్రీనివాస్, డి. క్రాంతికుమార్, సీనియర్ పాత్రికేయులు, మన పెద్దాపురం ఫేస్ బుక్ టీం, ఎస్ఎంఎస్, ప్రజా సంఘాల నాయకులు అభినందించారు.

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us