కాకినాడ: ఒకే కాన్పులో ముగ్గురు శిశువులు జన్మించిన అరుదైన సంఘటన కాకినాడ శ్రీ లాస్య ఆసుపత్రిలో శనివారం జరిగింది. ఆసుపత్రి మేనేజింగ్ డైరెక్టర్, ప్రముఖ గైనకాలజిస్ట్ డాక్టర్ మానెం రాధిక ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో వివరాలను వెల్లడించారు. స్థానిక డైరీఫారం సెంటర్ కు చెందిన సూదికొండ గంగాభవాని తన పుట్టింట్లో 25 వారాల పాటు మందులు వాడిందని, అయితే స్కానింగ్ పరీక్షలో ముగ్గురు శిశువులు తన కడుపులో ఉన్నట్లు తెలియడంతో స్థానిక వైద్యుల సలహా మేరకు తమ ఆసుపత్రిలో చేరిందన్నారు. అయితే తమ ఆసుపత్రిలో చేరినప్పటి నుంచి తల్లికి రక్తహీనత వంటి సమస్యలు లేకుండా అలాగే శిశువులకు ఎటువంటి ఇన్ఫెక్షన్లు సోకకుండా మందులు అందచేసి మంచి పౌష్టికాహారాన్ని అందచేయడం ద్వారా మెరుగైన వైద్య చికిత్సా విధానంలో తగు జాగ్రత్తలు తీసుకుని చికిత్స అందచేశామన్నారు. సాధారణంగా ఇటువంటి కేసుల్లో ౩౦ వారాలకే ప్రసవం కావడం, ఊపిరితిత్తులు సరిగ్గా ఎదగకపోవడం వంటి సమస్యలు ఏర్పడతాయన్నారు. దీన్ని దృష్టిలో ఉంచుకుని ఊపిరితిత్తులు ఎదిగేందుకు అవసమైన స్టెరాయిడ్ ఇంజక్షన్ ఇచ్చామని అలాగే 35 వారాలు పూర్తి అయిన తరువాత శిశువులు ఎదిగే అవకాశం అంతగా లేకపోవడం ముగ్గురు శిశువుల్లో ఒకరు అడ్డం తిరగడం, మరో శిశువు ఎదురు కాళ్లతో ఉండడం తదితర సమస్యల నేపథ్యంలో సాధారణ ప్రసవం చేసే అవకాశం లేకపోవడంతో శస్త్ర చికిత్స ద్వారా ముగ్గరు శిశువులను బయటకు తీశామన్నారు. ప్రస్తుతం ఈ శిశువులు ముగ్గురు 1.5, 1.7, 1.8 కేజీల బరువుతో ఆరోగ్యవంతంగా ఉన్నారని ఆమె తెలిపారు. ప్రసవం అయిన వెంటనే తమ ఆసుపత్రి కన్సల్టెంట్ పిడియాట్రీషియన్స్ డాక్టర్ జి. సిద్ధార్ధ కిరణ్, డాక్టర్ అంగర రవి, డాక్టర్ లక్ష్మీనారాయణ వైద్య పరీక్షలు నిర్వహించి మెరుగైన వైద్య సేవలు అందించారన్నారు. సాధారణంగా 5 వేల మందిలో ఒకరికి ఈ విధంగా ప్రసవం జరుగుతుందని, అలాగే 100 నుంచి 200 ప్రసవాలల్లో కవల పిల్లలు పుట్టే అవకాశం ఉంటుందని డాక్టర్ రాధిక పేర్కొన్నారు. సంతానం లేనివారు చికిత్స చేయించుకునే ఐవిఎఫ్ వంటి ప్రక్రియలు వీర్యకణాల ఫలదీకరణలో కాని లేదా పిండం తయారయ్యేటప్పుడు మూడు కణాలుగా విడిపోవడం వల్ల లేదా రేషియల్ ఫాక్టర్స్ వల్ల కాని ముగ్గురు శిశువులు కలిగే అవకాశం ఉంటుందని ఆమె పేర్కొన్నారు. తమ ఆసుపత్రిలో ఇటువంటి అరుదైన సంఘటన జరగడం పట్ల ఆమె హర్షం వ్యక్తం చేశారు.
UPDATED 10th JUNE 2017 SATURDAY 7:00 PM
Related News
-
SPECIAL STORY : సామాన్యుడి చేతికి టెక్నాలజీ అస్త్రం.. రోజువారీ జీవితంలో ‘ఏఐ’ విప్లవం!
-
TTD: తిరుమల శ్రీవారి నిత్య నైవేద్య వైభవం: ప్రసాద ప్రియుడైన ఏడుకొండలవాడు
-
VINTAGE VIBES : పాత రోజులు మళ్ళీ వచ్చేశాయ్!
-
Fulfilling Dreams: రుణం తీర్చుకున్న గురుభక్తి: పేద విద్యార్థినికి అభయమిచ్చిన ఆర్థోపెడిక్ వైద్యుడు
-
Fire Mishap on NH 44: అప్రమత్తతతో తప్పిన పెను ప్రమాదం.. 44వ జాతీయ రహదారిపై బస్సు దగ్ధం
-
TECH NEWS : వాట్సాప్లో 'బిల్ పేమెంట్స్'.. సౌలభ్యమా? ముప్పుతో కూడిన ప్రయోగమా?







